Share News

భవిత కేంద్రం సమస్యలను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:25 AM

విభిన్న ప్రతిభావంతులకు విద్యా బుద్దులు నేర్పించడంతో పాటు ఫిజియోథెరపి తదితర పరీక్షలను నిర్వహిస్తున్న భవిత కేంద్రం సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కోఆర్డినేటర్‌ పి.లింగారెడ్డి అన్నారు.

భవిత కేంద్రం సమస్యలను పరిష్కరిస్తాం

జిల్లా కోఆర్డినేటర్‌ లింగారెడ్డి

భువనగిరి రూరల్‌, ఫిబ్రవరి 26: విభిన్న ప్రతిభావంతులకు విద్యా బుద్దులు నేర్పించడంతో పాటు ఫిజియోథెరపి తదితర పరీక్షలను నిర్వహిస్తున్న భవిత కేంద్రం సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కోఆర్డినేటర్‌ పి.లింగారెడ్డి అన్నారు. ఈ నెల 22న ‘భవిత’వ్యం ఏమిటో..? అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం జిల్లా కోఆర్డినేటర్‌ పి.లింగారెడ్డి భవిత కేంద్రాన్ని పరిశీలించి, ఐఈఆర్‌పీ రవీందర్‌రెడ్డిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డార్మెంటరీ హాల్‌లో కుంగిన ఫ్లోరింగ్‌ను, మంచినీటి సంబంధించిన పైపులైనను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న భవిత కేంద్రంలో నెలకొన్న సమస్యలను ఎంపీడీవో సీహెచ.శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లాడు. ఎంపీడీవో కార్యాలయ బోరు నుంచి మంచినీటి పైపులైనను ఏర్పాటు చేసుకోవాలని తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎంపీడీవో వారికి సూచించారు. డార్మెంటరీ హాల్‌లో కుంగిన ఫ్లోరింగ్‌కు రెండు మూడు రోజుల్లో మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుని, విభిన్న ప్రతిభావంతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:25 AM