త్వరలో వర్గీకరణ సాధించనున్నాం
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:10 AM
త్వరలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యం నెరవేరబోతున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన ఎమార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
నల్లగొండటౌన్, మార్చి 7: త్వరలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యం నెరవేరబోతున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన ఎమార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం కమిటీ వేసిందని, దీనిపై సుప్రీంకోర్టులో చర్చ సైతం జరిగి తీర్పు వెలువడబోతుందన్నారు. వర్గీకరణకు కట్టుబడిన బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్రమోదీకి మాదిగలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. గత పాలకులు మాదిగలను నమ్మించి మోసం చేశారన్నారు. 2004 సెప్టెంబరు 5న కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ వర్గీకరణ రద్దు చేయించిదని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఒక్క రోజు కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని పేర్కొన్నారు. మాదిగలను దగా చేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు జానకిరామయ్యచౌదరి, యాతాకుల రాజన్న, కూరపాటి కమలమ్మ, మచ్చ ఏడుకొండలు, ఆడెపు నాగార్జున, ఏపూరి రాజు, కొండపల్లి ఆంజనేయులు, మడుపు శ్రీను, బొజ్జ చిన్న, పెరిక శ్రీనివాసులు, కందుల మోహన్, పాల్గొన్నారు.