Share News

విద్యారంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:01 AM

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఏ మంగ పిలుపునిచ్చారు.

విద్యారంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
విద్యార్థుల నమోదుకు ప్రచారం నిర్వహిస్తున్న తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంగ

కోదాడ టౌన, జూన 10 : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఏ మంగ పిలుపునిచ్చారు. సోమవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కరపత్రాలు పంపిణీ చేసి విస్త్రృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్య, వైద్యం, ప్రభుత్వ బాధ్యత అని ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్నివర్గాల ప్రజలు కృషి చేయాలన్నారు. సమాజంలో ప్రభుత్వ పాఠశాలలు నిలదొక్కుకున్నప్పుడే చదువుల్లో అంతరాలు పోతాయన్నారు. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విద్యారంగంపై తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించాలన్నారు. తెలంగాణ పౌరస్పందన వేదిక ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై ఉన్నాయని తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రభుత్వ విద్యారంగంతోనే రాజ్యాంగపరమైన హక్కులు సమాజానికి అందుతాయన్నారు. తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులు నిలబడేందుకు సమరశీల ఉద్యమం చేస్తున్నామన్నారు. వేదిక జిల్లా అధ్యక్షుడు ఆర్‌ ధనమూర్తి, ప్రాంతీయ అధ్యక్షుడు వీ వెంకటరమణ, కాప్రా ఉపాధ్యక్షుడు జీ వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రంగారెడ్డి, జీ వెంకటేశ్వర్‌రెడ్డి, షేక్‌ ఖాజామియా, డీఎన స్వామి, శేఖర్‌, హమీద్‌ పాల్గొన్నారు

Updated Date - Jun 11 , 2024 | 12:01 AM