Share News

పోచంపల్లి వసా్త్రలను విశ్వవ్యాప్తం చేశాం

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:23 AM

దేశంలో నిర్వహించిన జీ-20 సమ్మిట్‌లో ప్రతినిధులకు పోచంపల్లి వస్త్రాలను బహుమతిగా ఇవ్వడం ద్వారా మోదీ చేనేత కార్మికుల ప్రతిభను ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ అన్నారు.

పోచంపల్లి వసా్త్రలను విశ్వవ్యాప్తం చేశాం
బీజేపీ ర్యాలీలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి జైశంకర్‌, పక్కన అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

భువనగిరి టౌన, ఏప్రిల్‌ 23: దేశంలో నిర్వహించిన జీ-20 సమ్మిట్‌లో ప్రతినిధులకు పోచంపల్లి వస్త్రాలను బహుమతిగా ఇవ్వడం ద్వారా మోదీ చేనేత కార్మికుల ప్రతిభను ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ నామినేషన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ కే లక్ష్మణ్‌, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి మంగళవారం భువనగిరిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన కేంద్ర మంత్రి మాట్లాడారు. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికలు దేశ భవిష్యతతో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ అంటేనే 3డీ (ధర్మం, దేశం, డెవల్‌పమెంట్‌) అని అన్నారు. మూడోసారి మోదీ సర్కారులో భువనగిరికి ప్రాతినిధ్యం దక్కేలా ఓటర్లు నర్సయ్యగౌడ్‌ను గెలిపించాలన్నారు. దేశవ్యాప్తంగా ఓవర్గం అరాచకాలను సమర్థిస్తూ మత రాజకీయాలకు పాల్పడుతున్న హీన చరిత్ర కాంగ్రె్‌సదే అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి సీఎం రేవంతరెడ్డికి లేదన్నారు. అన్నివర్గాల అభివృద్ధి మోదీ పదేళ్ల పాలనలోనే సాధ్యమన్నారు. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దేవుళ్ల పేరిట ఒట్లు పెడుతూ అబద్ధాలు చెబుతూ మోసగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సీఎం రేవంతరెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అన్యాయం చేసిన సీఎం తన అనుచరుడైన ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి గెలిపించుకునే విధిలేని పరిస్థితుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఇంటి గుమ్మం తొక్కడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్‌పార్టీ అబద్ధపు ప్రచారానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెబుతారని అన్నారు.

నా వెనక మోదీ ఉన్నారు : బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

బలహీనవర్గానికి చెందిన తన వెనక ప్రధాని మోదీ ఉన్నాడని, తనపై సీఎం రేవంతరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ చేస్తున్న కుట్రలను ప్రధాని మోదీ అండతో ఎదుర్కొంటానని బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. కౌరవ సైన్యంతో జరుగుతున్న యుద్దంలో పాండవులదే గెలుపు తన గొర్రెను గెలిపించుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కాకా పడుతున్న సీఎం రేవంతరెడ్డికి నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే ఎనవీఎ్‌స ప్రభాకర్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పోతంశెట్టి రవీందర్‌, పడాల శ్రీనివాస్‌, దాసరి మల్లేశం, పడమటి జగన్మోహనరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్‌గుప్తా, యన్నం శివకుమార్‌, ఊట్కూరి అశోక్‌గౌడ్‌, మునిసిపల్‌ వైస్‌చైర్మన మాయ దశరథ, జెన్నపల్లి శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్‌, కౌన్సిలర్లు రత్నపురం బలరాం, బొర్ర రాఖేష్‌, ఉదయగిరి విజయ్‌కుమార్‌, నల్లమాస సుమ, జనగాం కవిత, ఊదరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 12:23 AM