వనమహోత్సవంలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Jul 17 , 2024 | 12:32 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
తుర్కపల్లి, జూలై 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ చింతపండు నవీనకుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం మండలంలోని బద్ధుతండాలో బంజారాలు నిర్వహించిన సీత్ల వేడుకల్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న పాల్గొన్నారు. ప్రభుత్వ నిధులతో గందమల్ల, బద్ధుతండాలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌లను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఝాన్సీలక్ష్మీబాయి, ఆలేరు మార్కెట్ మాజీ చైర్మన ధనావతు శంకర్‌నాయక్, నాయకులు జి.మధుసూదనరెడ్డి, కానుగంటి శ్రీనివా్‌సయాదవ్, ధనావతు మోహనబాబు, చాడ భాస్కర్‌రెడ్డి, ఐనాల చైతన్యమహేందర్‌రెడ్డి, కొమిరిశెట్టి నర్సింహులు, వెంకన్న, రాములు పాల్గొన్నారు. గందమల్ల గ్రామంనుంచి భువనగిరికి వెళ్లే బస్సును మంగళవారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పునరుద్ధరించారు. ఈ బస్సు గందమల్ల గ్రామం నుంచి వయా తుర్కపల్లి మండల కేంద్రం న ఉంచి జిల్లా కేంద్రమైన భువనగిరికి వెళుతుందని ఎమ్మెల్యే తెలిపారు. బస్సును గ్రామాస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే అయిలయ్యచ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బస్సులో అధికారులతో కలిసి ప్రయాణించారు.
పొట్టిమర్రి ఫీడర్ చానల్ పనులు పూర్తి చేయాలి: బీర్ల
రాజాపేట మండలం పొట్టిమర్రి ఫీడర్ ఛానల్ పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అధికారులను ఆదేశించారు. మండలంలోని పొట్టిమర్రి, గౌరాయిపల్లి, ఫీడర్ ఛానల్‌ను ఆయన పరిశీలించారు. రైతులను అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్ గౌడ్, పెంటయ్య, నరేష్, యాదెష్, బస్వయ్య, సిద్దులు పాల్గొన్నారు.