Share News

ఓటుతోనే చైతన్యవంత ప్రజాస్వామ్యం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:08 AM

ప్రతీ ఓటరు నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంత ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. త్వరలో నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంపు దిశగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ) ఆధ్వర్యంలో స్థానిక పభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన మూడు రోజుల ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె గురువారం ప్రారంభించారు.

ఓటుతోనే చైతన్యవంత ప్రజాస్వామ్యం
ఛాయచిత్ర పదర్శనను ప్రారంభించి తిలకిస్తున్న కలెక్టర్‌ హరిచందన

కలెక్టర్‌ దాసరి హరిచందన

ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం

నల్లగొండటౌన్‌, ఏప్రిల్‌ 25: ప్రతీ ఓటరు నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంత ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. త్వరలో నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంపు దిశగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ) ఆధ్వర్యంలో స్థానిక పభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన మూడు రోజుల ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఓటర్లు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. విద్యార్థులు పోలింగ్‌ రోజున సమయాన్ని వృథా చేయకుండా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి మంచి నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే కలెక్టర్‌ కార్యాలయంతో పాటు, క్లాక్‌ టవర్‌, ఇతర ముఖ్య కూడళ్ల వద్ద ఓటింగ్‌ యంత్రాల నమూనాలు, హోర్డింగ్‌లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశాన్నారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీటితోపాటు, నీడ సౌకర్యాలు కల్పించామని, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఓటరు చైతన్యంపై డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొండల్‌రావు స్వయంగా రచించిన పాటను పాడి వినిపించారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ సహాయ సంచాలకుడు యు.వెంకటేశ్వర్లు, సీబీసీ జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర్‌రావు, ఐకేపీ జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఘన్‌శ్యామ్‌, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు మనోజ్‌ కుమార్‌ మాణిక్‌రావు సూర్యవంశీ, పోలీసు పరిశీలకుడు అమోఘ్‌ జీవన్‌ గాంకర్‌ గురువారం జిల్లాకు చేరుకున్నారు. వారికి కలెక్టర్‌ దాసరి హరిచందన, ఎస్పీ చందనా దీప్తి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Updated Date - Apr 26 , 2024 | 12:08 AM