చారిత్రాత్మక సందర్శనీయ క్షేత్రం ఉండ్రుగొండ
ABN , Publish Date - Sep 26 , 2024 | 12:22 AM
చారిత్రాత్మక సందర్శనీయ క్షేత్రం ఉండ్రుగొండగిరిదుర్గమ ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
చివ్వెంల, సెప్టెంబరు 25 : చారిత్రాత్మక సందర్శనీయ క్షేత్రం ఉండ్రుగొండగిరిదుర్గమ ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం మండలంలోని ఉండ్రుగొండలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానాన్ని పరిశీలించి, మాట్లాడారు. పురాతన ప్రాంతంగా గుర్తింపు పొందిన గిరిదుర్గాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. చాలామంది రాజులు ఉండ్రుకొండను కేంద్రంగా చేసుకుని పాలన చేసిన ఆనవాళ్లు ఉన్నాయన్నా రు. ఈ ప్రాంతం నిజాం సుల్తానకాలంలో ధ్వంసమై శిథిల చరిత్రగా మిగిలిపోయిందన్నారు. కోట చుట్టూ ఎనిమిది గుట్టలు, వాటిని కలుపుతూ ఎత్తయిన ప్రాకారాలు, భారీ నిర్మాణాలు, 16 కిలోమీటర్ల మేర మట్టిగోడలు, 20 అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పుతో నిర్మాణాలు చేపట్టారన్నారు. రాజులు, సామంతులు, పరిపాలన నాయకులు నివసించే చోటు కావడంతో దుర్భేధ్యమైన ప్రాకారాలను రాళ్లతో నిర్మించారని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వేణుమాధవ్, డీఎ్‌ఫవో సతీ్‌షకుమార్, డీపీఆర్‌వో రమే్‌షకుమార్, తహసీల్దార్ కృష్ణయ్య, డాక్టర్ ఆదూర్తి రామయ్య, కార్యదర్శి రవిచంద్ర, ఆలయ కమిటీ సభ్యులు చకిలం కృష్ణకుమార్, కృష్ణమోహన, శ్రీరాములు, మురళీకృష్ణ, జుట్టుకొండ సత్యనారాయణ, నాగవల్లి బ్రహ్మయ్య, భరద్వాజ, సంతోష్, సైదులు, హర్ష సిబ్బంది పాల్గొన్నారు.