Share News

అత్తారింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:19 PM

అత్తారింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో శనివారం జరిగింది.

అత్తారింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య
కరుణ

శాలిగౌరారం, సెప్టెంబరు 21 : అత్తారింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో శనివారం జరిగింది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకారం గ్రామానికి చెందిన సూరారపు రాజుకు నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన కరుణతో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి మూడేళ్ల లోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు. సూరారపు రాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య కరుణను నిత్యం వేధిస్తున్నాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కరుణ మనస్తాపం చెంది ఇంట్లో ముబావంగా ఉంటోంది. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న నిద్రమాత్రలు వేసుకుంది. శనివారం తెల్లవారుజామున చనిపోయి ఉండటంతో భర్త రాజు తన మామ మాతంగి నర్సయ్యకు సమాచారం అందించారు. కుమార్తె మృతికి అల్లుడు రాజుతో పాటు కుటుంబసభ్యులు కూడా కారణమని నర్సయ్య పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Sep 21 , 2024 | 11:22 PM