Share News

సంక్రాంతి కానుకగా మరో రెండు పథకాలు

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:48 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా సంక్రాంతి కానుకగా మరో రెండు పథకాలను అందించనుందని ప్రభుత్వ విప్‌, బీర్ల అయిలయ్య తెలిపారు.

 సంక్రాంతి కానుకగా మరో రెండు పథకాలు

100 పడకల ఆస్పత్రిని త్వరలో నిర్మాణం చేయిస్తాం

షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి నిధులను పెంచుతాం

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌/ తుర్కపల్లి/ రాజాపేట/ ఆలేరు రూరల్‌, జనవరి 8: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా సంక్రాంతి కానుకగా మరో రెండు పథకాలను అందించనుందని ప్రభుత్వ విప్‌, బీర్ల అయిలయ్య తెలిపారు. మండలానికి మంజూరైన 54 చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు 200 మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు పథకాలను అమలు చేశామని, మహిళలకు రూ.500కే గ్యాస్‌, 200యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. నిధులు లేకున్నప్పటికీ గత ప్రభుత్వం అనేక శిలాఫలకాలు పెట్టి శంకుస్థాపన చేశారే తప్పా అవి ఆచరణకు నోచుకోలేదని అన్నారు. గతంలో మండలంలోని సైదాపురం ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రికి అప్పటి వైద్యశాఖ ఆరోగ్యమంత్రి శంకుస్థాపన చేసి, ఈ ప్రాంతం అనుకూలంగా లేదని మరోచోట ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అన్నారు. 100 పడకల ఆసుపత్రి నిధులు, స్థలం లేకుండా కలగా మారిందని, దానిని త్వరలో నిర్మించడానికి మల్లాపురం దేవనాయకులమర్రి ప్రాంతంలో ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా నిర్మాణానికి స్థలం గుర్తించినట్లు తెలిపారు. గుట్టలో ప్లైఓవర్‌ నిర్మించడంతో యాదగిరిపల్లి, గుట్టకు సంబంధాలు తెగిపోయి పాత బస్టాండ్‌ నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిపల్లి బుడిగె జంగాలకాలనీ, నల్లపోచమ్మవాడ, గాంధీనగర్‌లో ర్యాంపులు నిర్మిస్తే చేస్తే భక్తులు, స్థానికులకు రాకపోకలకు సులభతరం అవుతుందని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సైతం ప్రత్యేక ర్యాంప్‌ నిర్మాణం చేస్తామని చెప్పారు. అర్హులందరికీ పథకాలు అందేవిధంగా కృషిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుధాహేమేందర్‌గౌడ్‌, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తుర్కపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ పథకం చెక్కులను పంపిణీ ఎమ్మెల్యే అయిలయ్య పంపిణీ చేశారు. ఇటీవల వివాహాలు అయిన వారు కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా ఆలేరు నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసేందుకు అందరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన దానావత బీకు నాయక్‌, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్‌ నాయక్‌, తహసీల్దార్‌ దేశ్యా, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీటీసీలు ధనావత మోహన బాబు, కానుగంటి శ్రీనివాస్‌ యాదవ్‌, సంతోష భాస్కర్‌ రెడ్డి, సర్పంచలు పడాల వనిత శ్రీనివాస్‌, పోగుల ఆంజనేయులు, మల్లేశ, కో ఆప్షన సభ్యులు మహ్మద్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. రాజాపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జ్ఞానప్రకాశ, తహసీల్దార్‌ దామోదర్‌, ఎంపీపీ బాలమణి, జడ్పీటీసీ గోపాల్‌, సర్పంచలు ఈశ్వరమ్మ, శ్రవణ్‌ పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన తోపాటు యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం ఉన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:48 AM