Share News

‘యూనిటీ’ డాక్యుమెంటరీకి రెండు అవార్డులు

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:13 AM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన యూనిటీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు రెండు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.

‘యూనిటీ’ డాక్యుమెంటరీకి రెండు అవార్డులు

చౌటుప్పల్‌ టౌన, మార్చి 15: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన యూనిటీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు రెండు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ముంబాయిలో ఇటీవల నిర్వహించిన భారత ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌- 2023- 24లో యూనిట్‌ డాక్యుమెంటరీ రెండు అవార్డులను సొంతం చేసుకుంది. అర గంట పాటు సాగే ఈ డాక్యుమెంటరి ఫిల్మ్‌కు బెస్ట్‌ హిస్టారికల్‌ డాక్యుమెంట్‌ ఫిల్మ్‌, ఐకానిక్‌ ప్రైడ్‌ ఆ్‌ఫ్‌ ఇండియా అవార్డులను గెలుచుకుంది. కాగా, చౌటుప్పల్‌ పట్టణానికి చెందిన చిరందాస్‌ ధనుంజయ్య ఈ డాక్యుమెంటరీని రూపొందించగా, బడుగు విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు.

Updated Date - Mar 16 , 2024 | 12:13 AM