Share News

భువనగిరిలో కుండపోత వర్షం

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:35 PM

భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది.

భువనగిరిలో కుండపోత వర్షం
వరద నీరుతో చెరువును తలపిస్తున్న భువనగిరి బస్టాండ్‌

చెరువులను తలపించిన రహదారులు, బస్టాండ్‌

ఇబ్బందులు పడిన వాహనదారులు, చిరువ్యాపారులు, ప్రజలు

భువనగిరి రూరల్‌, జూన 8: భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశం ఒక్కసారి కుండపోతగా కురవడంతో పట్టణంలోని పలు ప్రధాన రహదారులు బస్టాండ్‌, లోత ట్టు ప్రాంతాలు జలమయమై చెరువుల తలపించా యి. ఎక్కడికక్కడ వర్షం నీరు మోకాల్లోతు నిలిచి పో వడంతో పట్టణంలోని ప్రిన్స కార్నర్‌, అంబేడ్కర్‌, జం ఖానగూడ, నల్లగొండ చౌరస్తా, బొమ్మాయిపల్లి అండ ర్‌ పాస్‌ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌- సమ్మద్‌ చౌరస్తా మధ్యన చెట్టు విరిగి మోటార్‌ సైకిల్‌పై పడడంతో ప్రమాదం తప్పింది. దీంతో మోటార్‌ సైకిల్‌ ధ్వంసం అయింది. కోర్టు ప్రాంగణంలో కూడా వరదనీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 2.45 గంటల నుంచి 3.45 గంటల వరకు గంటపాటు కురిసిన వర్షానికి భువనగిరి పట్టణ ప్రజలు, చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతోనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు పట్టించుకొని పట్టణంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్‌ తదితర లోతట్టు ప్రాంతాలలో వరదనీరు నిలవకుండా నివారణ చర్యలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో భారీవర్షాలు కురిస్తే పట్టణ పరిస్థితి ఘోరంగా తయారవుతుందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:35 PM