Share News

నేడు ఈదుల్‌ ఫితర్‌

ABN , Publish Date - Apr 11 , 2024 | 12:16 AM

రంజాన్‌ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు గురువారం నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 30 రోజుల ఉపవా స దీక్షను ఇఫ్తార్‌తో విరమించారు. సాయంత్రం నెలవంక కనిపించటంతో ఈదుల్‌ ఫితర్‌ రంజాన్‌ పండుగకు ముస్లింలు సన్నద్ధమయ్యారు.

నేడు ఈదుల్‌ ఫితర్‌

సామూహిక ప్రార్ధనలకు ముస్తాబైన ఈద్గాలు

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 10: రంజాన్‌ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు గురువారం నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 30 రోజుల ఉపవా స దీక్షను ఇఫ్తార్‌తో విరమించారు. సాయంత్రం నెలవంక కనిపించటంతో ఈదుల్‌ ఫితర్‌ రంజాన్‌ పండుగకు ముస్లింలు సన్నద్ధమయ్యారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు, తరావీ నమాజులు, ఖురాన్‌ పఠనంతో అల్లాను స్మరించుకున్న ముస్లింలు పండుగ పను ల్లో నిమగ్నమయ్యారు. భువనగిరి పట్టణంలోని హైదరాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న ఈద్గాలో ముస్లింల సామూహిక ప్రార్ధనలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. షామియానాలు ఏర్పాటుచేశారు. ప్రార్ధనలకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరుకానుండటంతో పోలీ్‌సశాఖ కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా పలు మసీదుల్లో రంజాన్‌ ప్రత్యేక ప్రార్ధనలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పండుగ సందర్భంగా పట్టణంలోని పలు వస్త్ర, నిత్యావసరాల సరుకుల దుకాణాలు సందడిగా మారాయి. ఈద్గాల వద్ద ఏర్పాట్లను మునిసిపల్‌, పోలీసు అధికారులు, ఈద్గా కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రం పరిశీలించారు.

ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు : మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రంజాన్‌ మాసంలో 30 రోజుల పాటు ఉపవాస దీక్ష లు చేసిన ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించాలని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం వేర్వేరు ప్రకటనల్లో కోరారు. రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రం జాన్‌ పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ముస్లిం ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

Updated Date - Apr 11 , 2024 | 12:16 AM