Share News

భువనగిరిలో గెలిచేది కాంగ్రెస్సే : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:23 AM

భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో మరోసారి గెలిచేది కాంగ్రెస్‌ పార్టీ అని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇనచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

 భువనగిరిలో  గెలిచేది కాంగ్రెస్సే : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
భువనగిరిలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో మాట్లాడుతున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

భువనగిరి టౌన, ఏప్రిల్‌ 12: భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో మరోసారి గెలిచేది కాంగ్రెస్‌ పార్టీ అని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇనచార్జి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలోని ఓ హోటల్‌లో తనను కలిసిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యతను అందరూ నాయకులు కార్యకర్తలు స్వీకరించాలన్నారు. రాష్ట్రంలో సాగుతున్న ప్రజా రంజక పాలనకు తోడు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల ఉత్సాహంతో భారీ మెజార్టీతో గెలుపు ఖాయమన్నారు. మున్సిపల్‌ మాజీ చైర్మన బర్రె జహంగీర్‌, కౌన్సిలర్‌ ఈరపాక నరసింహ, నాయకులు పంజాల రామాంజనేయులుగౌడ్‌, పడిగెల ప్రదీప్‌, పిట్టల బాలరాజ్‌, పుట్ట గిరిష్‌, కుమార్‌గౌడ్‌, గ్యాస్‌ చిన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:23 AM