మూడోసారి బరిలోకి
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:03 AM
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిం ది. ఊహించినట్టుగా తొలిజాబితాలోనే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ బూ ర నర్సయ్యగౌడ్‌కు పోటీ చేసే అవకాశం కల్పించింది.
భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూరకు ఛాన్స్
పుట్టినరోజు బహుమతిగా ఎంపీ టికెట్
పార్టీ మార్పుతో కలిసొచ్చిన అవకాశం
బంగారు భువనగిరిగా మారుస్తా: మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
యాదాద్రి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిం ది. ఊహించినట్టుగా తొలిజాబితాలోనే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ బూ ర నర్సయ్యగౌడ్‌కు పోటీ చేసే అవకాశం కల్పించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వైద్యుల సంఘాల జేఏ సీ తరపున పలు ఆందోళనలు చేపట్టిన నర్సయ్యగౌడ్‌ను ఉద్యమకారుడిగా గుర్తించి 2014లో బీఆర్‌ఎస్ అధిష్టానం భువనగిరి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిం ది. 2014లో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి, ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ అధిష్ఠానం తొలిజాబితాలో ప్రకటించిన తొమ్మిది స్థానాలను అత్యంత ప్రాధాన్యంగా భావిస్తోంది. భువనగిరి నియోజకవర్గం సెమీ అర్బన్, గ్రామీణప్రాంతా ల్లో కూడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం లో విజయం సాధించేందుకు అధికంగా అవకాశాలు ఉం టాయని భావించి, బలమైన సామాజిక వర్గం నేతను అభ్యర్థిగా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. భువనగిరి ని యోజకవర్గం మొత్తం ఐదు జిల్లాల పరిధిలో ఉంటుంది. యాదాద్రి భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, ఆలే రు నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో, అదేవిధంగా నకిరేక ల్, తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాలు పాక్షికంగా(నల్లగొండ, సూర్యపేటజిల్లాల పరిధిలో) ఉంటాయి. రంగారెడ్డిజిల్లాలోని ఇబహీంపట్నం, జనగాం జిల్లాలోని జనగాం అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నాయి. అయితే బూర నర్సయ్యగౌడ్ గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు గతఎన్నికల్లోనూ పోటీ చేశారు. రెండు దఫాలుగా ఎంపీగా పోటీలో ఉన్నందున ఆయన అనుభవం ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది.
పార్టీ మార్పుతో కలిసొచ్చిన అవకాశం...
బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి చేరడంతో ఎంపీగా పోటీ చేసే అవకాశం కలిసొచ్చింది. కాంగ్రె్‌సపార్టీ నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఉప ఎన్ని క అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక సమయంలో రాజకీయంగా భారీగా వలసలు చోటుచేసుకున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీలు ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలతో పాటు ప్రజాప్రతినిధులను చేర్చుకునేందుకు నిమగ్నమయ్యాయి. ఈ ఎన్నికను ఇరుపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గ ఓట ర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈనేపథ్యంలో అప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానంతో పాటు అప్పటి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డితో అంటీముంటనట్టుగా ఉండటంతోపాటు...పలుమార్లు సొంత పార్టీ నేతలపై బూర నర్సయ్యగౌడ్ విమర్శలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తే తాను బీజేపీ చేరుతానని అధిష్ఠానంతో చర్చలు జరిపారు. ఎంపీగా సీటు కేటాయించేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తామని పార్టీ రాష్ట్ర నేతలు హామీ ఇవ్వడంతో ఆయన బీజేపీ గూటికి చేరారు. అప్పటి నుంచి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పలుకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందరూ ఊహించిన విధంగానే బూర నర్సయ్యగౌడ్‌కు ఎంపీ టికెట్ ఖరారు చేసింది.
పుట్టిన రోజు కానుకగా ఎంపీ టికెట్...
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ శనివారం భువనగిరి లో తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భువనగిరి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించారు. లోక్‌సభ ని యోజకవర్గ పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, జనగాం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు కదలొచ్చారు. అధిష్ఠానం కూడా ఊహించినట్టుగానే బూర పుట్టిన రోజునే తొలిజాబితాను ప్రకటించింది. ఒక రకంగా బీజేపీ అధిష్ఠానం ఎంపీ టికెట్ తొలిజాబితాలోనే ప్రకటించడంపై పుట్టినరోజు కానుకగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈసందర్భంగా ఆయ న అనుచరులు పెద్దఎత్తున ఆనందం వ్యక్తం చేశారు.
బంగారు భువనగిరిగా మారుస్తా : మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే బంగారు భువనగిరిగా మారుస్తానని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. తాను గతంలో ఎంపీగా పనిచేసిన సందర్భంలో రూ.9వేల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. కేంద్రంలో మోదీ సహకారంతో మరిన్ని నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానన్నారు. ఎంపీగా ఉన్నప్పుడే ఎయిమ్స్, ఎంఎంటీఎస్, కేంద్రీయ విద్యాల య వంటి ఎన్నో సంస్థలు నెలకొల్పేందుకు కృషిచేశానని తెలిపారు.నియోజకవర్గం ప్రజల అండదండలతోపాటు బీజేపీ జా తీయ,రాష్ట్ర నేతల సహకారంతో తనకు ఎంపీ టికెట్ లభించిందని, తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.