Share News

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లో వస్తువులు దగ్ధం

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:48 PM

భువనగిరి మండలం నందనం పంచాయతీ పరిధిలోని సింగిరెడ్డిగూడెంలోని ఓ ఇంట్లో వస్తువులు దగ్ధమయ్యాయి.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లో వస్తువులు దగ్ధం

భువనగిరి రూరల్‌, ఫిబ్రవరి 27: భువనగిరి మండలం నందనం పంచాయతీ పరిధిలోని సింగిరెడ్డిగూడెంలోని ఓ ఇంట్లో వస్తువులు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన కడమంచి మల్లయ్య ఆ ఇంట్లో కడమంచి కరుణాకర్‌ అద్దెకు ఉంటున్నాడు. అతను, అతని భార్య వీధివీధిన తిరుగుతూ ఫ్యాన్సీ ఐటమ్స్‌(రోల్డ్‌గోల్డ్‌) విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా మంగళవారం కుటుంబ సభ్యులు బయటికి వెళ్లారు. ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఇల్లు కాలిపోయింది. ఇంట్లో ఉన్న సమారు రూ.4లక్షల విలువైన ఫ్యాన్సీ ఐటమ్స్‌, రూ.1.20లక్షల నగదు, ఇంటి సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.

Updated Date - Feb 27 , 2024 | 11:48 PM