Share News

నామినేషన్ల స్వీకరణపై అవగాహన ఉండాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:20 AM

నామినేషన్ల స్వీకరణ, హెల్ప్‌డెస్క్‌ సేవలపై సిబ్బందికి స్పష్టమై న అవగాహన ఉండాలని కలెక్టర్‌ హనుమంతు కే. జెండగే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్‌ బృందాలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియలో పరిశీలన, తిరస్కరణ అంశాలపై సరైన అవగాహన ఉండాలన్నారు.

నామినేషన్ల స్వీకరణపై అవగాహన ఉండాలి

కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే

భువనగిరి అర్బన్‌, ఏప్రిల్‌ 15: నామినేషన్ల స్వీకరణ, హెల్ప్‌డెస్క్‌ సేవలపై సిబ్బందికి స్పష్టమై న అవగాహన ఉండాలని కలెక్టర్‌ హనుమంతు కే. జెండగే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్‌ బృందాలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియలో పరిశీలన, తిరస్కరణ అంశాలపై సరైన అవగాహన ఉండాలన్నారు. పోటీ చేసే వ్యక్తి దేశ పౌరుడై ఉండాలని, నా మినేషన్ల ఉపసంహరణ నాటికి వయసు 25ఏళ్లు నిండి ఉండాలన్నారు. ఎలాంటి నేరచరిత్ర ఉండకూడదన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు సమర్పించని వారు అనర్హులన్నారు. నామినేషన్ల ప్రక్రియ ఆరు విభాగాలుగా ఉం టుందన్నారు. మొదటి విభాగంలో గుర్తింపు పొందిన రా జకీయ పార్టీ అభ్యర్థిని స్థానిక పార్లమెంట్‌ నియోజకవర్గ ఓటరు బలపర్చాలన్నారు. రెండో విభాగంలో ఇండిపెండెంట్‌, రిజిస్టర్డ్‌ పార్టీకి సంబంధిం చి 10మంది బలపర్చాలన్నారు. మూడో విభాగంలో గుర్తుల కేటాయింపు వివరాలు, నాలుగో విభాగంలో నామినేషన్‌ తేదీ, సమయం వివరాలు, ఐదో విభాగంలో రిటర్నింగ్‌ అధికారి ఆమోదం, ఆరో విభాగంలో రశీదు తదితర అంశాలు ఉంటాయన్నారు. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. హెల్ప్‌డెస్క్‌ ద్వారా అభ్యర్థుల నామినేషన్లు, డిపాజిట్లు, గుర్తుల కేటాయింపు, ఫాం-26, నోటరీ సహకారాలు అందిస్తామన్నారు. హెల్స్‌డె్‌స్కలో ఏడు అసెంబ్లీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలతో ఉండాలని, అభ్యర్థుల ప్రమాణం పై, చెక్‌లిస్ట్‌ ప్రకారం నామినేషన్ల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉం డాలన్నారు. అభ్యర్థిగా పోటీ చేసేవారు జనరల్‌ కేటగిరికి చెందిన వా రు రూ.25,000, ఎస్సీ, ఎస్టీ కేటగిరికి చెందినవారు రూ.12,500 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయి మాస్టర్‌ శిక్షకుడు కే.నర్సిరెడ్డి, ఆర్‌.హరినాథ్‌రెడ్డి శిక్షణ ఇవ్వగా కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కే.గంగాధర్‌, ఆర్డీవో పి.అమరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు

భువనగిరి లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నోడల్‌ అధికారులను కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ సిబ్బందికి కావాల్సిన అన్ని రకాల సామగ్రి సిద్ధంగా ఉంచాలన్నారు. ఎన్నికల సిబ్బందిని తరలించే వా హనాలను ఏర్పాటు చేయాలని, వాటికి ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి సిద్ధం చేయాలన్నారు. అలాగే సెక్టోరియల్‌ అధికారులకు వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులకు కావాల్సిన వసతులు, వీల్‌చైర్లు ఏర్పాటుచేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు పి.బెన్‌షాలోమ్‌, కే.గంగాధర్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన అధికారులు, సిబ్బందికి ఈ నెల 18న ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని వెన్నెల కళాశాలలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.

వసతి గృహ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి

వసతి గృహ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని సంక్షేమశాఖ అధికారులను కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు మంచి భోజనం ఏర్పాటు చేయాలని, అదనపు తరగతుల బోధన చేయాలన్నారు.

పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు రవాణా సౌకర్యంతో పాటు వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఏ చిన్న సమస్య రాకుండా ప్రిన్సిపా ళ్లు, వార్డెన్లు పరిశీలించాలన్నారు. సంక్షేమశాఖల అధికారులు తరచూ వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కే.గంగాధర్‌, ఆర్డీవో పి.అమరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:20 AM