Share News

ప్రజాసేవకు విరమణ లేదు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:31 AM

సమాజంలో ప్రభుత్వ అధికారులకు తప్ప ప్రజాప్రతినిధులకు పదవీ విరమణ ఉండదని, నిత్యం ప్రజాసేవలోనే కొనసాగడానికే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన కే శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

ప్రజాసేవకు విరమణ లేదు
కొండమల్లేపల్లి ఎంపీపీ దంపతులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే బాలునాయక్‌

ప్రెస్‌ అకాడమీ చైర్మన శ్రీనివాస్‌రెడ్డి

దేవరకొండ, జూలై4: సమాజంలో ప్రభుత్వ అధికారులకు తప్ప ప్రజాప్రతినిధులకు పదవీ విరమణ ఉండదని, నిత్యం ప్రజాసేవలోనే కొనసాగడానికే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన కే శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. గురువారం కొండమల్లేపల్లిలో నిర్వహించిన ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుందన్నారు. తన కుమార్తె కొండమల్లేపల్లి నూతన మండలంగా ఏర్పడి మొదటి ఎంపీపీగా ప్రజల ఆదరణను పొందడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. ఎంపీపీ దూదిపాల రేఖారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రశంసించారు. అనంతరం పదవీకాలం ముగిసిన ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖశ్రీధర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహతఅలీ, మధుసూదనరెడ్డి, జడ్పీటీసీ సరస్వతమ్మ, ఎంపీడీవో రాంరెడ్డి, దేవరకొండ మునిసిపల్‌ చైర్మన ఆలంపల్లి నర్సింహ, కోఆప్షన మెం బర్‌ సిరాజ్‌ఖాన, నాయిని మాధవరెడ్డి, వేమనరెడ్డి, లక్కిదాస్‌, కొర్ర రాం సింగ్‌, యుగంధర్‌రెడ్డి, కుంభం శ్రీనివా్‌సగౌడ్‌, గంధం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన నూతన కార్యాలయం ప్రారంభం

కొండమల్లేపల్లి మండలంలోని ఎస్‌వీ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కొండమల్లేపల్లి ప్రెస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన నూతన కార్యాలయాన్ని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన కే శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మంచి సహకారం అందే అవకాశం ఉందన్నారు. కొండమల్లేపల్లి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టులకు న్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు తగిన న్యాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ప్రెసిడెంట్‌ విరాహతఅలీ, జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు పులిమామిడి మహేందర్‌రెడ్డి, గాదె గిరిధర్‌రావు, మాధవరెడ్డి, ఉట్కూరి వేమనరెడ్డి, ఏరుకొండ రాము పాల్గొన్నారు. అదేవిధంగా మార్కెట్‌ యార్డులో జరిగిన దేవరకొండ డివిజన వర్కింగ్‌ జర్నలిస్టు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐజేయూ అధ్యక్షుడు విరాహతఅలీ మాట్లాడారు.

Updated Date - Jul 05 , 2024 | 12:31 AM