Share News

పేదల గొంతుకను పార్లమెంట్‌కు పంపించాలి

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:03 AM

నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాడే పేదల గొంతును పార్లమెంట్‌కు పంపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు.

పేదల గొంతుకను పార్లమెంట్‌కు పంపించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సీతారాములు

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సీతారాములు

రామన్నపేట, ఏప్రిల్‌ 7: నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాడే పేదల గొంతును పార్లమెంట్‌కు పంపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారని అలాగే సీపీఎం నుంచి ఎండి జహంగీర్‌ పోటీ చేస్తున్నాడని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఎర్రజెండాలు ప్రాతినిఽథ్యం పార్లమెంట్‌లో ఉండాలన్నారు. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఎంతో మంది అమరవీరులు తమ ప్రాణాలను ప్రజల కోసం త్యాగం చేసి, పేదలకు 10లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర ఎర్రజెండాకు ఉందన్నారు. అంతటి చరిత్ర కటిగిన ఎర్ర జెండాను ఆదరించి ప్రశ్నించే గొంతును పార్లమెంట్‌కి పంపించి ప్రజా స్వామ్య పరిష్కారానికి భువనగిరి పార్లమెంట్‌ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన వెసీ, సీపీఎం అభ్యర్థి ఎండి జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్‌రెడ్డి, కల్లూరి మల్లేశం, జగదీష్‌, ఆనగంటి వెంకటేశం, మండల కార్యదర్శి బొడుడపల్లి వెంకటేశం, ఎంపీపీ నాగటి ఉపేందర్‌, వనం ఉపేందర్‌, సింగిల్‌విండో వైస్‌చైర్మన అంబడి ఉపేంద్రరవీందర్‌రెడ్డి, మీర్‌ ఖాజాఅలీ, బి.ఆనంద్‌, జి.నరేందర్‌, బి.అంజయ్య ఉన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:03 AM