ఐలమ్మ పోరాట స్ఫూర్తి విశ్వవ్యాప్తం చేయాలి
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:13 AM
పెత్తందారీ భూస్వామ్య వ్యవస్థపై పోరాటం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చే యాలని రాష్ట్ర మహిళా కమిషన సభ్యురాలు ఐలమ్మ శ్వేత అన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన సభ్యురాలు ఐలమ్మ శ్వేత
మఠంపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : పెత్తందారీ భూస్వామ్య వ్యవస్థపై పోరాటం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చే యాలని రాష్ట్ర మహిళా కమిషన సభ్యురాలు ఐలమ్మ శ్వేత అన్నారు. మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన సన్నిధిలోని రజక సత్రంలో బుధవారం నిర్వహించిన రజక కులస్థుల కార్తీక వన భోజనాల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని, ఐలమ్మ పోరాటస్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. రజక కులస్థులు కలిసిమెలసి హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు. మట్టపల్లి క్షేత్రంలో ఐలమ్మపేరుతో రజక కుల సత్రం భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని కమిటీ సభ్యులతో కలిసి ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో రాచకొండ బాబు, పిల్లుట్ల శ్రీనివాస్, మట్టపల్లి రజక సత్ర కమిటీ అధ్యక్ష్య, కార్యదర్శులు పిల్లుట్ల కృష్ణయ్య, రేపాకుల కోటయ్య, కోశాధి కారి దుగ్గివర్మ, నాగేశ్వరావు, పోనుగోటి కోటయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.