Share News

ఎన్నికల్లో పీవో, ఏపీవోల బాధ్యత కీలకం

ABN , Publish Date - May 23 , 2024 | 12:12 AM

:జిల్లాలో శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక నేపథ్యంలో పీవో, ఏపీవోల బాధ్యతలు కీలకమని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు అన్నారు.

 ఎన్నికల్లో పీవో, ఏపీవోల బాధ్యత కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 22 :జిల్లాలో శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక నేపథ్యంలో పీవో, ఏపీవోల బాధ్యతలు కీలకమని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఉపఎన్నికపై పీవోలకు, ఏపీవోలకు ఇస్తున్న శిక్షణ తరగతుల సందర్భంగా అదనపు కలెక్టర్‌ సీహెచ ప్రియాంకతో కలిసి మాట్లాడారు. పోలింగ్‌ ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలు గు గంటల వరకు జరుగుతుందన్నారు. జిల్లాలో 51,497 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని 71 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పోలింగ్‌ కోసం రిజర్వ్‌తో కలిపి 85 మంది పీవోలు, 85 మం ది ఏపీవోలు, 170 మంది ఓపీవోలుగా సిబ్బందిని నియమించామన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నిక జరుగుతుందని ఎన్నికల్లో 52 మంది పోటీ చేస్తున్నందున జంబో బ్యాలెట్‌ బాక్స్‌ ఏర్పాటుచేశామన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ పెద్దగా ఉన్నందున ఓటువేసిన తర్వాత జాగ్రత్తగా మడిచి బ్యాలెట్‌ బాక్స్‌లో వేయాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మౌళిక వసతులు, తాగునీరు, ఎలక్ర్టిసిటీ ఏర్పాటుచేయాల ని ఆదేశించారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్నుతో మాత్రమే బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న జోనలో ప్రాధాన్య క్రమంలో నెంబర్లుగాని, రోమన సంఖ్యలు వేస్తే ఓటు చెల్లుతుందని తెలిపారు. అక్షరాలు, టిక్కులు, సంతకాలు చేసిన ఓ ట్లు చెల్లవన్నారు. ఓటు వేసిన తర్వాత ఓటరు ఎడమ చేతి మధ్య వేలుకు ఇంక్‌తో పోలింగ్‌ సిబ్బంది గుర్తుపెట్టాలని, అంధులైన ఓటర్ల కు వారి వెంట వచ్చిన సహాయకులతో ఓటు వేయించాలని తెలిపా రు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ఓటరు ఫెసిలిటేషన సెంటర్‌ ద్వారా పోలింగ్‌ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌తో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంసీసీ నోడల్‌ అధికా రి, డీఎ్‌ఫవో సతీ్‌షకుమార్‌, మ్యానఫవర్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారి జడ్పీ సీఈవో అప్పారావు, రిపోర్టింగ్‌ నోడల్‌ అధికారి, డీఆర్‌డీవో మధుసూదనరాజు, జిల్లా రవాణా అధికారి సురేష్‌, జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారి లక్ష్మానాయక్‌, ఆర్డీవో వేణుమాధవ్‌, మాస్టర్‌ ట్రైనర్‌ రమేష్‌, శ్రీనివాసరాజు, వెంకటేశ్వర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

13మంది ఓపీవోలు సస్పెండ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకానీ 13మంది ఓపీవోలపై సస్పెన్షన వేటుపడింది. ఈ మేరకు కలెక్టర్‌ వెంకటరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నిర్వహించిన శిక్షణకు 13 మంది ఓపీవోలు గైర్హాజరయ్యారు. వీరిని తక్షణమే సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం

ప్రతీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఉచితంగా యూనిఫాం అందజేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటరావు అన్నారు. కలెక్టరేట్‌లో నూతన యూనిఫాంలను అదనపు కలెక్టర్‌ ప్రియాంకతో కలిసి సమీక్షించా రు. ఇప్పటివరకు జిల్లాలో 11, 576 యూనిఫాంలు కుట్టి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన 2వతేదీలోపు 100శాతం పూర్తిచేయాలన్నారు. ఎంఈవోల ద్వారా ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 41,427 మంది విద్యార్థుల కు మొదటి జత పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా ఏర్పాటుచేసిన మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ద్వారా స్కూల్‌యూనిఫాంలను కుట్టించి ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న ట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదే తీరులో ధాన్యం కొనుగోళ్లలో కూడా బాగా పనిచేశారని ట్యాబ్‌ ఎంట్రీ ద్వారా రైతుల ఖాతాలో నగదు అతి తక్కువ సమయంలో వేశారని కొనియాడారు.

Updated Date - May 23 , 2024 | 12:12 AM