విద్యుత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:01 AM
విద్యుత కార్మికులు ఎదుర్కొంటున్న 52 సమస్యలను పరిష్కరించాలని యజమాన్యానికి విజ్ఞప్తి చేసినా పరిష్కారం కాలేదని తెలంగాణ ఎలకి్ట్రసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ సాయిబాబు అన్నారు.

భువనగిరి రూరల్, జూన 11 : విద్యుత కార్మికులు ఎదుర్కొంటున్న 52 సమస్యలను పరిష్కరించాలని యజమాన్యానికి విజ్ఞప్తి చేసినా పరిష్కారం కాలేదని తెలంగాణ ఎలకి్ట్రసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ సాయిబాబు అన్నారు. మంగళవారం భువనగిరిలో తెలంగాణ ఎలకి్ట్రసిటీ ఫోర్‌మన పీ ప్రకాశ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాత్రీపగలు కార్మికులు ఎంతో ఒత్తిడితో విధులు నిర్వహిస్తూ వినియోగదారులకు సేవలు అందిస్తున్నా ఐదేళ్ల నుంచి ప్రమోషన్లు లేకుండా అవస్థలు పడుతున్నారన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిస్కం కంపెనీ అధ్యక్షుడు ఏ వేణు, ఎన వెంకన్న, జనార్ధనరెడ్డి, ఎస్‌సీ శ్రీనాథ్, డీఈలు మల్లికార్జున, విజయభాస్కర్‌రెడ్డి, యూనియన అధ్యక్షుడు పీ యాదగిరి, అమర్‌నాథ్, గోపాల్, సురేందర్‌రెడ్డి, మీర్జా షకీల్‌బెగ్, టీ రమే్‌షరెడ్డి, సత్యనారాయణ, శ్రీనివా్‌సరెడ్డి, రమేష్, సోమేశ్వర్‌రెడ్డి, బాబుగౌడ్, శ్రీకాంత, అనిల్, భాస్కర్, నాగరాజు, ఉమ, స్వరూప, సోమమ్మ, స్వాతి పాల్గొన్నారు.