Share News

సమస్యలకు నెలవుగా జిల్లా ఆసుపత్రి

ABN , Publish Date - May 21 , 2024 | 11:57 PM

జిల్లా ఆసుపత్రి సమస్యలకు నెలవుగామారి రోగులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ అన్నారు.

సమస్యలకు నెలవుగా జిల్లా ఆసుపత్రి
జిల్లా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు

సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

భువనగిరి టౌన, మే 21: జిల్లా ఆసుపత్రి సమస్యలకు నెలవుగామారి రోగులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ అన్నారు. మంగళవారం సీపీఎం నాయకులు జిల్లా ఆసుపత్రికి సందర్శించి పేరుకుపోయిన సమస్యలను పరిశీలించారు. రోగులు, సహాయకులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా ప్రైవేట్‌ లేదా హైదరబాద్‌ ఆసుపత్రులకు వెళ్లాలని రోగులకు వైద్యులు సూచిస్తుండడం.. జిల్లా ఆసుపత్రి ఇంకా రెఫరల్‌ ఆసుపత్రిగానే కొనసాగుతుండటం దారుణమన్నారు. పూర్తిస్థాయి వసతులు కల్పించి అన్ని వైద్య సేవలు అందించాలని, ఖాళీలను భర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో రాజకీయ పార్టీలకు ప్రాతినిఽథ్యం కల్పించాలన్నారు. మాతాశిశు ఆసుపత్రిని ప్రత్యేకంగా నిర్మించాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, నాయకులు దాసరి పాండు, మాయ కృష్ణ, దయ్యాల నర్సింహ, గడ్డం వెంకటేష్‌, ముత్యాలు, శివ, అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:09 AM