Share News

తప్పులు లేకుండా ఉప ఎన్నిక నిర్వహించాలి

ABN , Publish Date - May 25 , 2024 | 12:07 AM

ఎలాంటి తప్పుల కు ఆస్కారం ఇవ్వకుండా వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పోలింగ్‌ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణలో ఆమె మాట్లాడారు.

తప్పులు లేకుండా ఉప ఎన్నిక నిర్వహించాలి

కలెక్టర్‌ దాసరి హరిచందన

నల్లగొండ టౌన్‌, మే 24: ఎలాంటి తప్పుల కు ఆస్కారం ఇవ్వకుండా వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పోలింగ్‌ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణలో ఆమె మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున బ్యాలెట్‌ పేపర్‌ ఎలా మడతపెట్టాలో తెలుసుకోవాలని,ఇండెబుల్‌ ఇంక్‌ సహా అన్ని విషయాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. 800 పైబడి ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు రెండు బ్యాలెట్‌ బాక్సు లు కేటాంచామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సం దర్భగా ఓటర్లకు ఎడమచేయి చూపుడు వేలుకు ఇండెబుల్‌ ఇంక్‌ మార్క్‌ కేటాయించినందున ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లకు ఎడమ చేయి మధ్య వేలుకు ఇంక్‌ మార్క్‌ చేయాలన్నారు. ఓటర్లు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేసిన వాయిలె ట్‌ స్కెచ్‌ పెన్‌ ద్వారా మాత్రమే ప్రాధాన్య క్రమం లో ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌, వాటర్‌ బాటిళ్లు, ఇంక్‌ బా టిల్‌, ఇంక్‌ పెన్నులను అనుమతించవదన్నారు. ఎవరైనా ఓటు వేశాక సెల్‌ఫోన్‌తో ఫొటో తీసుకుంటే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామన్నారు. ప్రతీపోలింగ్‌ కేంద్రం వెబ్‌ కాస్టింగ్‌ నియంత్రణలో ఉంటుందన్నారు. అంతేగాక సూక్ష్మ పరిశీలకులు, పీవో, ఏపీవో, ఇతర పోలింగ్‌ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ల సీల్‌, ఫాం-16, పీవో డైరీ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, స్పెషల్‌ కలెక్టర్‌ నటరాజ్‌, ఆర్డీవోలు, మాస్టర్‌ ట్రైనర్‌ బాలు, తదితరులు పాల్గొన్నారు.

సూక్ష్మపరిశీలకులు అప్రమత్తంగా వ్యవహరించాలి

శాసన మండలి ఉప ఎన్నిక పోలింగ్‌లో సూక్ష్మ పరిశీలకులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పరిశీలకుడు రాహుల్‌ బొజ్జ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ విధివిధానాలకు అనుగుణంగా పోలింగ్‌ ప్రక్రియ జరుగుతున్నది లేనిది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కలెక్టర్‌ దాసరి హరిచందన మాట్లాడుతూ, ఉప ఎన్నిక పోలింగ్‌లో భాగంగా ఏజెంట్ల హాజరు, బ్యాలెట్‌ బాక్సుల సీలింగ్‌ ప్రక్రియ, ఓటర్‌ను గుర్తించే ప్రక్రియ, రహస్య ఓటింగ్‌ విధానం తదితర విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్‌, శిక్షణ కార్యక్రమాల నోడల్‌ అధికా రి, జేడీఏ శ్రవణ్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రామిక్‌, జిల్లా మీసేవ అధికారి రాజశేఖర్‌, మాస్టర్‌ టైన్రర్స్‌ బాలు, గోపి, తదితరులు పాల్గొన్నారు.

రాజకీయపరమైన బల్క్‌ ఎస్‌ఎంఎ్‌సలపై నిషేధం

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసే 48 గంటల ముందు నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు గానీ, రాజకీయ పార్టీలు గానీ బల్క్‌ ఎస్‌ఎంఎ్‌సలు పంపడం నిషేధమని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దాసరి హ రి చందన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బల్క్‌ ఎస్‌ఎంఎ్‌సలు పంపితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు, రాజకీయ పార్టీ లు, మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు సైతం దృష్టి లో ఉంచుకొని 25 సాయంత్రం 4 నుంచి 27వ తేదీ సాయంత్రం 4గంటలవరకు ఎ లాంటి బల్క్‌ ఎస్‌ఎంఎ్‌సలు పంపవద్దన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:07 AM