Share News

ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్న బీజేపీ పాలన

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:17 AM

కేంద్రంలోని బీజేపీ పాలన నాటి ఎమర్జెనీ తలపింపజేసేదిగా ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అరోపించారు.

ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్న బీజేపీ పాలన
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం నాయకుడు సీతారాములు

బెదిరించడం, లొంగదీసుకోవడమే వారి లక్ష్యం

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు

ఆలేరు రూరల్‌, మార్చి 28: కేంద్రంలోని బీజేపీ పాలన నాటి ఎమర్జెనీ తలపింపజేసేదిగా ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అరోపించారు. గురువారం ఆయన ఆలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెదిరించడం, లొంగతీసుకోవడం, లేదంటే ఈడీ సీబీఐ అంటూ భయపెట్టడమే లక్ష్యంగా మారిందన్నారు. నియంతృత్వ చర్యలు, పాలన ఎక్కువ కాలం మనలేవన్నారు. ప్రభుత్వాలు మారినా ప్రజల రాతలు మారడం లేదని దేశంలో అత్యంత భయానక పరిస్థితులు నెలకొననున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అయారాంలు, గయారాంలు, మాఫీయాలదే రాజ్యమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయని పాపాలు లేవని అన్నారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై కూడా కేసు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించాలని చూస్తే సీపీఎం సహించబోదన్నారు. విధాన పరమైన విషయాల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. తమ పార్టీకి ఓట్లు, సీట్ల కన్నా విధాన పరమైన చర్యలే ముఖ్యమని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అర్హులైన పేదలకే ఫలితాలు దక్కాలన్నారు. భూ కబ్జాదారులు, తప్పులు చేసిన వారంతా బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలోకి వలసలు వస్తుండడం విడ్డూరమన్నారు. భువనగిరి పార్లమెంట్‌ నుంచి తమ పార్టీ అభ్యర్థి, ఉద్యమ నాయకుడు జహంగీర్‌కు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీ మత కలహాలు సృషించాలని చూస్తోందని, మత సామరస్యం వర్థిల్లేలా ప్రజలంతా ఐక్యం కావాలన్నారు. ఢిల్లీ సీఎం క్రేజీవాల్‌ను, శిభుసోహెనను, కవిత ను పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ జైళ్లలోకి పంపించిందన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, భట్టుపల్లి అనురాధ, ఇక్బాల్‌, మంగ నర్సింహులు, మొరిగాడి రమేష్‌, రాజేష్‌, మల్లేశం, నర్సింహ, నాగరాజు, ప్రశాంత పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:17 AM