తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి
ABN , Publish Date - May 26 , 2024 | 11:55 PM
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి క్రిష్టఫర్ ప్రభుత్వాన్ని కోరారు.
వలిగొండ, మే 26: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి క్రిష్టఫర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఉద్యమకారుల పాటల సీడీని ఎస్‌ఐ మహేందర్ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్టఫర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అమరులైన కుటుంబాలను ఈ పాటలతో గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఆనాటి పోరాటాలను భవిష్యత్తు తరాలకు అందించాలని ఉద్దేశంతో ఈ సీడీని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివా్‌సగౌడ్, నాయకులు ఎం.వెంకటేశం, కన్నెకంటి శ్రీనివాసాచారి, మంతి రమేష్, అంజయ్య, భిక్షపతి, శంకర్, లింగస్వామి, మహేష్ పాల్గొన్నారు.