Share News

సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:17 AM

సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. జడ్పీ కార్యాలయంలో మంగళవారం జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

వేదికపై జడ్పీచైర్మన్‌, ఎమ్మెల్యే మందుల సామేలు వాగ్వాదం

జడ్పీ సమావేశంలో సమస్యలపై గళం విప్పిన సభ్యులు

భువనగిరి రూరల్‌, మార్చి 5: సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. జడ్పీ కార్యాలయంలో మంగళవారం జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సర్పంచ్‌లు లేని కారణం గా ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత అందరి పై ఉందన్నారు. అధికారులు తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూ చించారు. వేసవిలో నీటి సమస్య రాకుండా ముంద స్తు చర్యలు చేపట్టాలన్నారు. నీటి సమస్య పరిష్కారానికి నియోజకవర్గానికి రూ.2కోట్ల నిధులు మం జూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. అదేవిధంగా ఏక కాలంలో రుణమాఫీ చేసేందుకు ప్రభు త్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ప్రొటోకాల్‌ పాటించడంలో అధికారులు చేస్తున్న పొరపాట్లను ఉపేక్షించబోమన్నారు. ఇటీవల గుండాల మండలం లో మాజీ ప్రతినిధుల పేర్లతో శిలాఫలకాలను ఏర్పా టు చేయడం సరికాదన్నారు. జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరె డ్డి మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అం దించడంతోపాటు అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను ఎన్నికల కోడ్‌ రాక ముందే పూర్తి చేయాలన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌ మాట్లాడుతూ అధికారులు గత ప్రభుత్వ పద్ధతులను మా ర్చుకోవాలన్నారు. గత ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయక ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. తమ నియోజకవర్గంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి కేటాయించిన నిధులను వెంటనే విడుద ల చేయించి ప్రజల నీటి సమస్యలను పరిష్కరించాలన్నారు. నాలుగేళ్లుగా అసంపూర్తిగా నిలిచిన కా టేపల్లి-మోత్కూరు రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్య ను ఆదేశించారు. కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే మాట్లాడుతూ సంక్షేమ పథకాలను పేదలకు అం దించేందుకు అధికారులు పారదర్శకంగా పని చే యాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, అర్హు లు లబ్ధిపొందేందుకు జిల్లాలోని ఎంపీడీవో, మునిసిపల్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశామని ప్రజలు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు.

వేదికపై జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యే సామేలు మధ్య వాగ్వాదం

సమావేశంలో జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరె డ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు మధ్య కొద్దిసేపు వా గ్వాదం చోటు చేసుకుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి పోయిందని..., రాళ్లు, గుట్టలు, ప్లాట్లకు రైతుబంధు ఇచ్చారని, ఆర్టీసీని నిర్వీర్యం చే శారని ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆరోపించడంతో జడ్పీచైర్మన్‌ అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఇది ప్రజా స మస్యలు, ప్రభుత్వ పథకాల పురోగతి, అమలు సమీ క్షా సమావేశమని, దీనిని రాజకీయ సభగా మలుచు కొని జిల్లా పరిషత్‌ను అవమానపర్చడం సరికాదన్నారు. దీంతో వారిద్దరి మధ్య కొద్దిసేపు ఘర్షణ వా తావరణం నెలకొన్నది. రైతుల సమస్యలు, సంక్షేమం పై కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బదులిచ్చారు. ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ ధనావత్‌ బీకూనాయక్‌, జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ కు డుదుల నగేష్‌, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయా మండలాల పరిధిలో నెలకొన్న సమస్యలపై గళం విప్పారు. నీటి సమస్య, అసంపూర్తి నిర్మాణాలు, సంక్షేమ పథకాల అమలులో జాప్యం, మిషన్‌ భగీరథ నీరు కలుషితం, గ్రామాల్లో బెల్ట్‌షాపుల నివారణ తదితర అంశాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారిగా సమావేశానికి హాజరైన మందుల సామేలును ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, జడ్పీచైర్మన్‌ సందీ్‌పరెడ్డి సన్మానించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, డిప్యూటీ సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:17 AM