యూత్ ఛాంపియన్‌షి్‌పలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:49 PM
రాష్ట్ర యూత్ ఛాంపియన్‌షి్‌ప పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 6, 7వ తేదీల్లో హన్మకొండలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురుషుల, మహిళల ఛాంపియన్‌షి్‌ప పోటీల్లో వివిధ విభాగాల్లో క్రీడాకారులు 15 పతకాలు సాధించి జిల్లాను అగ్రభాగంలో నిలిపారు.

15 పతకాలతో అగ్రస్థానం
భువనగిరి టౌన్, జూన్ 7: రాష్ట్ర యూత్ ఛాంపియన్‌షి్‌ప పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 6, 7వ తేదీల్లో హన్మకొండలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురుషుల, మహిళల ఛాంపియన్‌షి్‌ప పోటీల్లో వివిధ విభాగాల్లో క్రీడాకారులు 15 పతకాలు సాధించి జిల్లాను అగ్రభాగంలో నిలిపారు. మల్లిక 10 వేల మీటర్ల పరుగు పందెంలో బంగారు, 5 వేల మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించింది. సునీల్ 5వేల మీటర్లు, 1500 మీటర్ల పరుగు పందెంలో రజ త పతకాలు సాధించాడు. ఉషారాణి 1500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం, పవన్‌రాజ్ 150 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించారు. నిఖిత 400 మీటర్ల హార్డిల్స్‌లో బంగారు పతకం సాధించగా, డిస్క్‌సత్రోలో సచిన్ బంగారు, రాహుల్ రజత, హ్యామర్‌త్రోలో ప్రదీప్ కాంస్యం, షాట్‌పుట్‌లో బుచ్చమ్మ కాంస్య పతకాలు సాధించారు. వారికి రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు స్టాన్లీ జోన్స్, సారంగపాణి పతకాలు అందజేశారు. కాగా వారిని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మునిసిపల్ చైర్మెన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి కోనేటి గోపాల్ అభినందించారు.