Share News

జాతీయ స్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:31 AM

నేరేడుచర్ల మండలం ముకుందాపు రం గ్రామానికి చెందిన ఎశమల్ల సమస్ర జాతీయస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చింది.

జాతీయ స్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ
విజయం సాధించిన జట్టు, సహస్ర(ఫైల్‌)

నేరేడుచర్ల, ఫిబ్రవరి 26: నేరేడుచర్ల మండలం ముకుందాపు రం గ్రామానికి చెందిన ఎశమల్ల సమస్ర జాతీయస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. బీహార్‌ రాష్ట్రంలోని పాట్నాలో ఈ నెల 25న జరిగిన 41వ జాతీయ బేస్‌బాల్‌ పోటీల్లో సహస్ర సారథ్యంలోని తెలంగాణ జట్టు జాతీయస్థాయి పోటీల్లో మొదటి స్థానం సాధించి బంగారు పతకం గెలుచుకుంది. ముకుందాపురం గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఏశమల్ల చంద్రమోహన్‌ కూతురు సమస్ర హైద్రాబాద్‌లోని హయత్‌నగర్‌లో శ్రీవిశిష్ట జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన సమస్రను ముకుందాపురం గ్రామస్థులు అభినందించారు.

Updated Date - Feb 27 , 2024 | 12:31 AM