ముగ్గురు ఉపాఽధ్యాయుల సస్పెన్షన
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:20 AM
ముందస్తు అనుమతి లేకుం డా విధులకు గైర్హాజరవుతూ నిర్లక్ష్యం వహిస్తున్న ముగ్గు రు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో పాటు మరో ఇద్దరి ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అందించిన ట్లు డీఈవో అశోక్ ప్రకటనలో తెలిపారు.

మరో ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
భానుపురి, జూలై 27 : ముందస్తు అనుమతి లేకుం డా విధులకు గైర్హాజరవుతూ నిర్లక్ష్యం వహిస్తున్న ముగ్గు రు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో పాటు మరో ఇద్దరి ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అందించిన ట్లు డీఈవో అశోక్ ప్రకటనలో తెలిపారు. తుంగతుర్తి మండలంలోని బండరామారం ఎంపీపీఎస్ ఉపాధ్యాయు డు పీ వెంకటరాములు(ఎ్‌సజీటీ) ఈనెల 5 నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరు అవుతున్నాడని, తుంగతుర్తి మండలంలోని నూనతండా ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు పీ.సత్యమూర్తి(ఎ్‌సజీటీ) ఈ నెల 3 నుంచి విధులకు గైర్హాజరు కావడంతో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు. చివ్వెంల మండలం గుంపులతిరుమలగిరి ఉన్నత పాఠశాలలో స్కూల్ ఆసిస్టెంట్ ఎం.నాగమణి లీ వ్ లెటర్ లేకుండా విధులకు గైర్హాజరుకావడంతో సస్పెం డ్ చేశామన్నారు. ఇదే పాఠశాలకు చెందిన మరో ఇద్దరు ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్ నోటీసులు అందజేసినట్లు డీఈవో పేర్కొన్నారు. పాఠశాలకు చెందిన ఆర్. వెంకటయ్య(ఎ్‌సఏ సోషల్), ఉపాధ్యాయురాలు పీ జానకి(ఎ్‌సఏ హిందీ)లకు సైతం షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు డీఈవో ప్రకటించారు.