Share News

డీసీసీబీ అవిశ్వాసంపై ఉత్కంఠ

ABN , Publish Date - Jun 12 , 2024 | 01:02 AM

డీసీసీబీ చైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తీర్మానం నెగ్గి చైర్మన్‌ను గద్దెదింపుతామని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే, డైరెక్టర్ల మద్దతు తనకే ఉందని, అవిశ్వాసం వీగిపోతుందని ధీమాలో చైర్మన్‌ మహేందర్‌రెడ్డి ఉన్నారు.

డీసీసీబీ అవిశ్వాసంపై ఉత్కంఠ

ఎవరి ధీమా వారిదే

అవిశ్వాసం వీగిపోతుందనే నమ్మకంలో గొంగిడి

నెగ్గి తీరుతామంటోన్న కాంగ్రెస్‌

రసవత్తరంగా రాజకీయం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): డీసీసీబీ చైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తీర్మానం నెగ్గి చైర్మన్‌ను గద్దెదింపుతామని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే, డైరెక్టర్ల మద్దతు తనకే ఉందని, అవిశ్వాసం వీగిపోతుందని ధీమాలో చైర్మన్‌ మహేందర్‌రెడ్డి ఉన్నారు. ఈనెల 28న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరగనుండడంతో నోటీసు ఇచ్చిన డైరెక్టర్లు కాంగ్రె్‌సకు చెందిన డైరెక్టర్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక శిబిరానికి తరలి వెళ్లారు. అవిశ్వాసపు నోటీసు ఇచ్చినప్పటికీ బీఆర్‌ఎ్‌సలో కొనసాగుతున్న డైరెక్టర్లు సమావేశంలో పాల్గొనరనే విషయంతో అవిశ్వాసంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలం టే మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. ప్రస్తుత పాలకవర్గంలో 19 మందికి డైరెక్టర్లకు 14 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తే చైర్మన్‌ పదవి నుంచి దిగాల్సి ఉంటుంది. అయితే మొత్తం 19మం ది డైరెక్టర్లలో చైర్మన్‌ మహేందర్‌రెడ్డితో పాటు, డైరెక్టర్లు రంగాచారి, అప్పిరెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి ఇప్పటి కీ బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతుండడంతో పాటు, అవిశ్వాసంపై సంతకాలు చేసిన వారిలో కూడా ఇంకా ఆరుగురు పార్టీ మారలేదని, బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతున్నారని,వారు తనకే మద్దతుగా నిలుస్తారనే వి శ్వాసాన్ని మహేందర్‌రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. అవిశ్వాసం సమావేశంలో వారు ఓటింగ్‌లో పాల్గొనకపోయినా,తీర్మానానికి అనుకూలంగా ఓటేయకపోయినా అవిశ్వాసం వీగిపోతుంది. వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లందరి సహకారంతో తాను డీసీసీబీని రాష్ట్రంలోనే రెండో అ తిపెద్ద బ్యాంకుగా తీర్చిదిద్దానని, నిరర్థక ఆస్తులను 11శాతంనుంచి 1.80శాతానికి తగ్గించామని, బ్యాంకు టర్నోవర్‌ రూ.900 కోట్ల నుంచి రూ.2400 కోట్లకు పెంచామని అంటున్నారు.గతంలో దేవరకొండ కుం భకోణం లాంటి అక్రమాలతో బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటే, తమ హయాంలో అలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతిష్ట పెంచామని, ఈ విషయాలన్నీ డైరెక్టర్లందరికీ తెలుసని, వారందరూ తనకే మద్దతుగా ఉంటారని ఆయన పేర్కొంటున్నారు.

అవిశ్వాసం నెగ్గుతామంటున్న కాంగ్రెస్‌

ఓ వైపు అవిశ్వాసం వీగుతుంద నే ధీమాలో చైర్మన్‌ మహేందర్‌రెడ్డి వర్గం ఉంటే, మరోవైపు అవిశ్వాసాన్ని నెగ్గుతామని కాం గ్రెస్‌ డైరెక్టర్లు నమ్మకంగా కన్పిస్తున్నారు. తీర్మానంపై సంతకాలు చేసిన 14 మంది ఏకతాటిపై ఉన్నారని, మహేందర్‌రెడ్డిని గద్దెదింపడం ఖాయమని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే సమావేశం రోజున ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయననే చర్చ సాగుతోంది. సంతకాలు చేసినప్పటికీ వీరిలో ఇంకా బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతున్న డైరెక్టర్లలో ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనకపోయినా తీర్మానం వీగిపోతుందని, ఆలాంటి పరిస్థితి వస్తే కాంగ్రె్‌సకు ఇబ్బందికరంగా ఉంటుందని పార్టీలో చర్చసాగుతోంది. పార్టీ మారినా, మారకపోయి నా అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసిన డైరెక్టర్లంతా చైర్మన్‌కు వ్యతిరేకంగానే ఉన్నారని, ఆయనకు మద్దతిచ్చే ప్రసక్తే ఉండదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. మొత్తంగా అవిశ్వాస ఘట్టం లో ఇప్పటికీ బీఆర్‌ఎ్‌సలో కొనసాగే డైరెక్టర్లపైనే సర్వత్రా చర్చ నడుస్తుండడంతో, కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఈ చర్చకు ఫుల్‌స్టాప్‌ ఎలా పెడతారనే ఆసక్తి రాజకీయవర్గాల్లో సాగుతోంది.

నేటి పాలకవర్గ సమావేశం సాగేనా?

అవిశ్వాస తీర్మాన విషయం ఇలా ఉండగా, మరోవైపు ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు బుధవారం డీసీసీబీ పాలకవర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే 14 మంది డైరెక్టర్లు అవిశ్వాస నోటీసు ఇచ్చిన తర్వాత ప్రత్యేక శిబిరానికి తరలివెళ్లిన నేపథ్యంలో ఈ సమావేశం కొనసాగడం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. వైస్‌ చైర్మన్‌ ఇప్పటికే విదేశాల్లో ఉండడంతో, చైర్మన్‌, మరో ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. సమావేశం నిర్వహణకు అవసరమైన కోరం సభ్యులు 50శాతం ఉండాలి. అయితే కనీసం 10 మంది డైరెక్టర్లు వస్తేనే సమావేశం జరుగుతుందని, లేకపోతే వాయిదా పడుతుందని అధికారులు చెబుతున్నారు.

అవిశ్వాసం వీగడం ఖాయం : గొంగిడి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌

నాపై కాంగ్రెస్‌ నేతల ప్రోద్బలంతో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయం. మా హయాంలో బ్యాంకును ఎంతగా వృద్ధిలోకి తీసుకువచ్చామో వైస్‌ చైర్మన్‌ సహా డైరెక్టర్లందరికీ తెలిసిందే. వారందరి సహకారంతో బ్యాంకు ప్రతిష్ట పెంచాం. అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగించాం. రాజకీయ లక్ష్యాలతోనే అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఇప్పటికీ బీఆర్‌ఎ్‌సలోనే ఉన్న డైరెక్టర్ల మద్దతు నాకే ఉంది. వారి సహకారంతో తీర్మానం వీగిపోతుందని నమ్ముతున్నా. నేనే చైర్మన్‌గా కొనసాగుతా.

Updated Date - Jun 12 , 2024 | 01:02 AM