Share News

‘సన్‌’డే

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:01 AM

భానుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ఆదివారం కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమికి ప్రజలు బయటకు రావడంలేదు. దీంతో ప్రధాన రోడ్లతోపాటు కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి కొండపై ఎండవేడిమితో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

‘సన్‌’డే

పెరుగుతున్న ఉష్ణోగ్రలతో జనం బెంబేలు

నల్లగొండ జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌

ఉమ్మడి జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నల్లగొండ, ఏప్రిల్‌ 7: భానుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ఆదివారం కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమికి ప్రజలు బయటకు రావడంలేదు. దీంతో ప్రధాన రోడ్లతోపాటు కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి కొండపై ఎండవేడిమితో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి జిల్లాలో ఆదివారం అత్యధికంగా నిడమనూరు మండలం, అనంతగిరి మండలం శాంతినగర్‌ 44.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లా ని డమనూరు మండలంలో అత్యధికంగా 44.5 డిగ్రీలు, అత్యల్పంగా చింతపల్లి మండలంలో గొడకండ్ల 40.0 డిగ్రీలు, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం బుజి లా పురంలో 43.4 డిగ్రీలు, రాజాపేట మండలం పాముకుంటలో అత్యల్పంగా 40.0 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీలు, అత్యల్పంగా తుంగతుర్తి మండలంలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నల్లగొండ జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌

నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. నిడమనూరు మండలంలో 44.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రత పెరగడంతో వాతావరణశాఖ నల్లగొండ జిల్లాను ఆరెంజ్‌ అలర్ట్‌గా ప్రకటించింది. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైతే ఆరెంజ్‌ అలర్ట్‌గా గుర్తిస్తారు. 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే హెచ్చరికగా ప్రకటిస్తారు.

Updated Date - Apr 08 , 2024 | 12:01 AM