Share News

సర్వతోముఖాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:40 AM

నా తెలంగాణ.. కోటి రతనాల వీణ.. అమరుల ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిది అని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అన్నారు.

సర్వతోముఖాభివృద్ధికి కృషి

అన్నిరంగాల్లో ముందడుగే ధ్యేయం

ఎన్నో వనరులు, చారిత్రక సంపద మన సొంతం

తెలంగాణ పోరాటంలో అమరుల త్యాగం అజరామరం

కలెక్టర్‌ హనుమంతు కే. జెండగే

భువనగిరి అర్బన్‌: నా తెలంగాణ.. కోటి రతనాల వీణ.. అమరుల ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిది అని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అన్నారు. పోరాటాల ఖిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్రంలోనే పోరాట చరిత ఉందని, ఆ పోరాట స్ఫూర్తితోనే జిల్లాను ముందుకు తీసుకెళ్లడంలో ప్రజలు సహకరించాలని చెప్పారు. సబ్బండ వర్ణాల ఆర్థిక పరిపుష్టి, సాగునీటి ప్రాజెక్ట్‌ల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. రైతాంగానికి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరముందన్నారు.

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే పిలుపునిచ్చారు. రాష్ట్ర అవిర్భావ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్‌ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం కలెక్టర్‌ స్వీకరించి, జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడారు. తెలంగాణ సిద్ధించి పదేళ్లు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ఘనంగా నిర్వహించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరవీరుల కు టుంబాలు, కార్మిక, కర్షక, విద్యార్థులు, జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ యాదాద్రి భువనగి రి జిల్లా అన్నారు. మన తెలంగాణ మహాకవి దాశరథి కీర్తించినట్లుగా ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అం టూ.. సాధించుకున్న రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసు కుందామన్నారు. ఎందరో త్యాగధనులు, ఎన్నో వనరు లు, మరెంతో చారిత్రక సంపద, మన వారసత్వం, స్వపరిపాలన, సుపరిపాలన కోసం చేసిన తెలంగాణ ప్రజల పోరా టం అజరామరమన్నారు. పోరాటంలో అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తున్నామన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం

రాష్ట్ర అవిర్భావం తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని రంగాల్లో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్‌ అన్నారు. అందరం అంకితభావంతో కలిసికట్టుగా పని చేసి అమరుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు అత్యధిక సంఖ్యలో ఓ టు వినియోగించుకొని రాష్ట్రంలోనే భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ప్రథమస్థానంలో నిలపడం అభినందనీయమన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తోడ్పాటు అందించిన అధికారులు, సిబ్బంది, పో లీస్‌ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, వైస్‌ చైర్మన్‌ బీకూనాయక్‌, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీపీ ఎం. రాజేష్‌చంద్ర, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ పి. బెన్‌షాలోమ్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కే.గంగాధర్‌, జడ్పీ సీఈవో శోభారాణి, భువనగిరి ఆర్డీవో పి.అమరేందర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీలు బీరు మల్లయ్య, కుడుదుల నగేష్‌, ఎంపీపీ నరాల నిర్మల, జిల్లా అధికారులు అనురాధ, కృష్ణవేణి, పి.యాదగిరి, జినుకల శ్యాంసుందర్‌, అన్నపూర్ణ, ఎం.ఏ కృష్ణన్‌, కే. నారాయణరెడ్డి పాల్గొన్నారు.

అమరవీరులకు నివాళి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం భువనగిరి లో అట్టహాసంగా నిర్వహించారు. ఉద్యమం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని అమరులకు నివాళి అర్పించారు. ఉద్యమ కా రులను ఆత్మీయంగా సత్కరించారు. ప్రభుత్వ, ప్రైవేటు కా ర్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అమర వీరుల స్మారక స్థూపం వద్ద కలెక్టర్‌ హనుమంత్‌ కే.జెండగే, డీసీపీ ఎం.రాజేశ్‌చంద్ర తదితర ప్రముఖులు నివాళి అర్పించారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి జాతీయ జెండా ను ఎగురవేసి శెట్టి బాలయ్య యాదవ్‌ తదితర ఉద్యమకారులను సత్కరించారు. మునిసిపల్‌ చైర్మెన్‌ వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ఎండీ జహంగీర్‌, గోద శ్రీరాములు తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.

సమష్టిగా అభివృద్ధి చేసుకోవాలి : జయరాజు

భువనగిరి టౌన్‌: త్యాగాలతో సాధించుకున్న తెలంగాణాను సమష్టి కృషితో అభివృద్ధి చేసుకోవాల్సిన బా ధ్యత అందరిదని జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కోర్టు ప్రాం గణంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయ న మాట్లాడారు. కాలుష్య, అవినీతి రహిత, శాంతియుత సమాజ స్థాపనలో అందరూ భాగస్వాములు కావాలన్నా రు. ఈ నెల 8న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ పడదగిన కేసులన్నింటినీ పరిష్కరించుకోవాలని సూచించారు. ముందుగా జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు వి.మాధవీలత, డి.నాగేశ్వర్‌రావు, కవిత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.హరినాథ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే:విప్‌ అయిలయ్య

ఆలేరు రూరల్‌: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆలేరులోని క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితం కారణంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని సోనియమ్మ త్యాగం అజరామరమన్నారు. తెలంగాణలోని ప్రతీ పౌరుడికి గౌరవం కల్పిస్తామని, సబ్బండవర్గాలకు ప్రజాపరిపాలన అందించాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమన్నారు. ప్రజాకవి అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించడం అద్భుతమన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్‌, కాండ్రాజు వెంకటేశ్వర్‌రాజు, ఎంఏ ఎజాజ్‌, పీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం పద్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 12:40 AM