Share News

లేబుల్‌ సరిగాలేని విత్తనాల విక్రయం నిలుపుదల

ABN , Publish Date - May 29 , 2024 | 12:18 AM

విత్తన ప్యాకెట్లపై లేబుల్‌ సరిగాలేని కొన్ని కంపెనీల విత్తనాల విక్రయాలను నిలుపుదల చేసినట్లు ఏడీఏ స్క్వాడ్‌ బృందం అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

 లేబుల్‌ సరిగాలేని విత్తనాల విక్రయం నిలుపుదల
ఫర్టిలైజర్‌ దుకాణంలో తనిఖీ నిర్వహిస్తున్న స్క్వాడ్‌ అధికారులు

సంస్థాననారాయణపురం, మే 28: విత్తన ప్యాకెట్లపై లేబుల్‌ సరిగాలేని కొన్ని కంపెనీల విత్తనాల విక్రయాలను నిలుపుదల చేసినట్లు ఏడీఏ స్క్వాడ్‌ బృందం అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం సంస్థాననారాయణపురం మండలంలో పలు ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని కంపెనీలకు చెందిన వరి విత్తనాల బ్యాగులపై డేట్‌ ఆఫ్‌ టెస్టింగ్‌, డేట్‌ ఆఫ్‌ ప్యాకింగ్‌ వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో అమ్మకాలను నిలుపుదల చేసినట్లు తెలిపారు. డీలర్లు విత్తనాలను తీసుకువచ్చేటప్పుడే లేబుల్స్‌ను పూర్తిగా చూసి రైతులకు విక్రయించాలని సూచించారు. బిల్లులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. గుర్తింపు పొందిన విత్తన డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు. విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ బృందంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు ముత్యాల నాగరాజు, స్వప్న పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:18 AM