Share News

పాఠశాల స్థాయిలోనే క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలి

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:43 AM

విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాన్ని పాఠశాల స్థాయిలో గుర్తించి ప్రోత్సహిస్తే ఉత్తమ క్రీడాకారులుగా తయారవుతారని ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ అన్నారు.

పాఠశాల స్థాయిలోనే క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలి
మిర్యాలగూడలో స్కూల్‌ గేమ్స్‌ విజేతలతో ఉపాధ్యాయులు

వేములపల్లి, సెప్టెంబరు 20: విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాన్ని పాఠశాల స్థాయిలో గుర్తించి ప్రోత్సహిస్తే ఉత్తమ క్రీడాకారులుగా తయారవుతారని ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ అన్నారు. స్థానిక జిల్లాపరిషత ఉన్నతపాఠశాలలో శుక్రవారం మండలస్థాయి పాఠశాల క్రీడా పోటీలను ఎంఈవో బాలాజీనాయక్‌తో కలిసి ఆయన ప్రారంభించి, మాట్లాడారు. కాగా మండలంలోని పలుపాఠశాలలకు చెందిన విద్యార్థులు అండర్‌-14, అండర్‌-17 కబడ్డీ, ఖోఖో పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబర్చారు. కార్యక్రమంలో హెచఎంలు లక్ష్మణ్‌నాయక్‌, రమేష్‌, సత్యనారాయణ, సుజాత, వసంత, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పీడీలు దేవేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కాంతారెడ్డి పాల్గొన్నారు.

మాడ్గులపల్లి: మండలకేంద్రంలో జూనియర్‌ మండల స్థాయి క్రీడలను ఎస్‌ఐ శోభనబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాపోటీలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తా యన్నారు. కార్యక్రమంలో ఎంఈవో బాలాజీనాయక్‌, నోడల్‌అధికారి వెంకటమ్మ, రవీందర్‌, యుగేందర్‌రెడ్డి, గురువయ్య పాల్గొన్నారు.

మిర్యాలగూడ టౌన : విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎంఈవో బాలాజీనాయక్‌ తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పట్టణ ప్రముఖుడు గుడిపాటి నవీన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచఎం ధర్మానాయక్‌, స్థానిక కౌన్సిలర్‌ రవినాయక్‌, వేణుగోపాలరెడ్డి, వెంకటరత్నం, శోభారాణి, శ్రీనివాసాచారి, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వెంకటయ్య, నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:43 AM