Share News

బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:10 AM

మండలంలోని గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో వార్షికబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గరుడసేవ నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ
పగిడిమర్రిలో వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణోత్సశానికి హాజరైన భక్తులు

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 25 : మండలంలోని గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో వార్షికబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గరుడసేవ నిర్వహించారు. ఉదయం ఆలయ మహామంటపంలో హోమం, బలిహారణం చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై ఉత్సవమూర్తులను ఆలయ వీధుల్లో ఊరేగించారు. వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త కోమటిరెడ్డి మోహనరెడ్డి,రాజేశ్వరి దంపతులు,సిబ్బంది సింహాచలం, వేణు, మత్స్యగిరి, నాగరాజు పాల్గొన్నారు.

నేత్రపర్వగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం

కనగల్‌ : మండలంలోని పగిడిమర్రిలోని గోవిందాంబసమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు వడిబియ్యం, కట్నకానుకలను సమర్పించి మొక్కులు చెల్లించారు. మాజీ సర్పంచలు గోలి నర్సిరెడ్డి దంపతులు, గోలిజగాల్‌రెడ్డి దంపతులు వేర్వేరుగా పట్టువసా్త్రలు, తలంబ్రాలను అందజేశారు. సాయంత్రం గ్రామంలో రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్రమాద యశోదమ్మ, నాయకులు సుంకిరెడ్డి రవీందర్‌రెడ్డి, సింగం సత్తయ్య, వెంకట్‌రెడ్డి, మల్లేష్‌, సైదులు, వెంకన్న, చంద్రశేఖర్‌రెడ్డి, నర్సింహా, రవీందర్‌, కృష్ణారెడ్డి, షణ్ముఖాచారి, భూషణాచారి, నర్సింహాచారి పాల్గొన్నారు.

మారేపల్లిలో వేంకటేశ్వరస్వామి..

హాలియా : మండలంలోని మారేపల్లి గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున స్వామివారి తిరుకల్యాణాన్ని కన్నులపండుగా నిర్వహించారు. అదేవిధంగా తలంబ్రాలు, గజవాహన సేవ, ఆరగింపు, తీర్థప్రసాద వినియోగం, గరుడ సేవ, పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట మాజీ ప్రధాన అర్చకులు కారంపూడి లక్ష్మీనర్సింహాచార్యులు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం గ్రామ పురవీఽధుల్లో కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు అంగరంగవైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అనుముల మండల వైస్‌ ఎంపీపీ మాలే అరుణసత్యనారాయణరెడ్డి, దేవాలయ అధికారి అంబటి నాగిరెడ్డి, చైర్మన మట్టపల్లి వెంకన్న, గంగుల వెంకన్న, శ్రీకాంత, బర్పటి సరిత, శ్రీను, మెండే ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, అశోక్‌, చక్రపాణి పాల్గొన్నారు.

ఘనంగా దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన

చిట్యాల రూరల్‌ : మండలంలోని బొంగోనిచెర్వు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గణపతి, నంది, జంట నాగులు, నవగ్రహ విగ్రహా ప్రతిష్ఠా కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయా విగ్రహాలు, ఆలయాల దాతలు వెలిమినేటి నర్సిరెడ్డి, పన్నాల నీరజ, మహేందర్‌రెడ్డి, వెలిమినేటి సబిత, బుచ్చిరెడ్డి, కళమ్మ, బొబ్బలి స్వర్ణలత, వెంకటేశ్వర్‌రెడ్డిలను పూజారులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన సామిడి సాయికుమార్‌, సామిడి మోహనరెడ్డి, ఏనుగు గోపాల్‌రెడ్డి, సత్తిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సందీ్‌పరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ఎంపల్ల పద్మ, రమణమ్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ముత్యాలమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం

అడవిదేవులపల్లి: మండలంలోని చిట్యాల గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవాన్ని భక్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అంకాల కాశయ్య, నాగేశ్వర్‌రావు, గోపి, నాగేశ్వర్‌రావు, ఏడుకొండలు పాల్గొన్నారు

కుంభాభిషేకం

దేవరకొండ / చందంపేట : పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో ద్వితీయ పుష్కర కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ పాల్గొన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ చందంపేట మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, నాయకులు నీల రవికుమార్‌, బోయపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌, రమావత మోహనకృష్ణ, గోసుల అనంతగిరి, కేతావత శంకర్‌నాయక్‌, రమావత తులసిరాం, బొడ్డుపల్లి కృష్ణ, సత్యనారాయణ, వడ్త్య బాలు, రవి, సైదులు, అంజి, రాంరెడ్డి, చంద్రమౌళి పాల్గొన్నారు. అదేవిధంగా చందంపేట మండలం పెద్దమూల గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ పాల్గొన్నారు

Updated Date - Feb 26 , 2024 | 12:10 AM