Share News

హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:04 AM

గురుకుల వస తి గృహాల నిర్వహణపై సంబంధిత వార్డెన్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా పరిషత్‌ సీఈవో ఎన్‌.శోభారాణి సూచించారు. శుక్రవారం స్థానిక జడ్పీ కా ర్యాలయంలో విద్యా, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

జడ్పీ సీఈవో శోభారాణి

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 19: గురుకుల వస తి గృహాల నిర్వహణపై సంబంధిత వార్డెన్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా పరిషత్‌ సీఈవో ఎన్‌.శోభారాణి సూచించారు. శుక్రవారం స్థానిక జడ్పీ కా ర్యాలయంలో విద్యా, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్యం, రోజువారీ మెనూ, ప్రతీ విద్యార్థి హెల్త్‌ చార్ట్‌, వైద్య శిబిరా ల ఏర్పాటు తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టే విధంగా వార్డెన్లు కృషి చేయాలన్నారు. వసతి గృహాల్లో స్టాక్‌ రిజిస్టర్ల నిర్వహణ, ప్రతీనెల 23న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలన్నారు. ప్రతీ శుక్రవారం వసతి గృహాల పర్యవేక్షణ చేపట్టి గూగుల్‌ మీట్‌ నిర్వహిస్తూ సంబంధిత రిపోర్టును కలెక్టర్‌, సీవోలకు నివేదించాలన్నారు. ముందుగా ఇటీవల గురుకుల విద్యాలయంలో మృతి చెందిన విద్యార్థి ప్రశాంత్‌ ఆత్మకు శాంతి కలిగించాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. సమావేశంలో డీఎంఎహెచ్‌వో పాపారావు, డీఆర్‌డీవో ఎంఏ కృష్ణన్‌, డీసీహెచ్‌వో డాక్టర్‌ చిన్నా నాయక్‌, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు జైపాల్‌రెడ్డి, యాదయ్య, రీజనల్‌ కోఆర్డినేటర్‌ రజిని, బీసీ గురుకుల సంస్థ ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, హాస్టల్‌ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:04 AM