Share News

ఆరు గ్యారంటీ పథకాలను త్వరగా అమలు చేయాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:39 AM

ఎన్నికల్లో గెలుపొందేందుకు దోహదపడిన ఆరుగ్యారంటీ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌చేశారు.

ఆరు గ్యారంటీ పథకాలను త్వరగా అమలు చేయాలి

భువనగిరి టౌన, జనవరి 11: ఎన్నికల్లో గెలుపొందేందుకు దోహదపడిన ఆరుగ్యారంటీ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌చేశారు. గురువారం భువనగిరిలో జరిగిన ఐద్వా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరు గ్యారంటీ పథకాలతోనే అధికారంలోకి వచ్చామనే స్పృహను కాంగ్రెస్‌ కలిగి ఉండాలన్నారు. అభయహస్తం పథకంలో జమయిన రూ.600కోట్లను మహిళా సంఘాల ఖాతాల్లో వేయాలన్నారు. ఈమేరకు గత ప్రభుత్వం మహిళా సంఘాల బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించినప్పటికీ నిధులను జమచేయడాన్ని విస్మరించిందన్నారు. సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అవ్వారి రామేశ్వరి, భట్టుపల్లి అనురాధ, కల్లూరి నాగమణి, బత్తుల జయమ్మ, లక్ష్మి, లావణ్య, సునీత పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:39 AM