Share News

నీటి ఎద్దడి ఛాయలు

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:11 AM

జిల్లా కేంద్రం భువనగి రి పట్టణంలో క్రమేపీ తాగునీటి ఎద్దడి ఛాయలు అలుముకుంటున్నాయి.

 నీటి ఎద్దడి ఛాయలు

పవర్‌ బోర్లే ఆధారం

డిమాండ్‌లో సగమే సరఫరా చేస్తున్న హెచఎం డబ్ల్యూఎస్‌

మూడు రోజులకోసారి కృష్ణా జలాలు..

రోజు విడిచి రోజు స్థానిక జలాల సరఫరా

భువనగిరి టౌన, ఏప్రిల్‌, 12: జిల్లా కేంద్రం భువనగి రి పట్టణంలో క్రమేపీ తాగునీటి ఎద్దడి ఛాయలు అలుముకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు సమస్య తీవ్రత లేనప్పటికీ వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగొతే మాత్రం పట్టణవాసులకు తాగునీటి కష్టాలు తప్పకపోవచ్చు. పట్టణంలో ని 35 వార్డుల్లో 77,294 మంది నివసిస్తున్నారు. మునిసిప ల్‌ నిబంధనల ప్రకారం ప్రతీరోజు ఒక్కక్కరికి 135 లీటర్ల నీరు నల్లాల ద్వారా సరఫరా జరగాల్సి ఉంటుంది. ఈ మేర కు పట్టణంలోని సుమారు 10,341 నల్లాలు, ట్యాంకర్ల ద్వారా రోజువారీగా 10.43 ఎంఎల్‌డీ తాగునీరు సరఫరా కావల్సి ఉంది. కానీ భువనగిరి పట్టణానికి ప్రధాన తాగునీ టి వనరైన హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ (హెచఎం డబ్ల్యూఎస్‌) నుంచి ప్రతీరోజు కేవలం 5 ఎంఎల్‌డీ గోదావరి జలాలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. దీంతో ప్రజల అవసరాలను తీర్చేందుకు మునిసిపల్‌ యాంత్రాం గం 122 పవర్‌ బోర్ల ద్వారా రోజుకు 5.87 ఎంఎల్‌డీ, మూ డు విలీన గ్రామాలలో స్థానిక వనరుల ఆధారంగా మరో 0.44 ఎంఎల్‌డి జలాలను సరఫరా చేస్తున్నారు. మూడు రోజులకోసారి గోదావరి, రోజు విడిచి రోజు స్థానిక జలాలు వేరువేరు పైప్‌ లైన్లద్వారా సరఫరా జరుగుతోంది. పైప్‌లేన లేని ఇందిరమ్మ, నందగిరి తదితర కాలనీలో మూడు వ్యవసాయ బావుల మోటార్ల నుంచి నాలుగు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. హెచఎం డబ్యూఎస్‌ గోదావరి జలాల సరఫరాలో ఏ మాత్రం అవాంతరం ఏర్పడినా పట్టణవాసులు తాగునీటికి అల్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. తాగునీటి చట్టం ప్రకారం పట్టణంలోని పబ్లిక్‌ నల్లాలన్నింటినీ నాలుగేళ్ల క్రితమే మునిసిపల్‌ యంత్రాంగం తొలగించింది. రికార్డుల ప్రకారం 34 చేతి పంపుల ఉన్నప్పటికీ పనిచేయనివే అధికంగా ఉండటం గమనార్హం.

యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో..

యాదగిరిగుట్ట రూరల్‌ : యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో ఇప్పటి వరకు నీటి సమస్య రాలేదు. మునిసిపాలిటిలో సుమారు 4600 ఇళ్లు ఉండగా అందులో 3600ఇళ్లకు ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మిగతా వాటికి సొంత బోర్లు ఉన్నాయి. పబ్లిక్‌ నల్లాలు సుమా రు 60వరకు ఉన్నాయి. గుట్టకు ప్రతీ రోజు 15లక్షల వర కు మిషన్‌భగీరథ నీరు రావాల్సి ఉండగా రోజుకు 8, 9లక్షల నీరు మాత్రమే వస్తోంది. గుట్ట మునిసిపాలిటీకి సొంత బోర్లు 45ఉండగా మరో మూడు బోరు బావులు అద్దెకు తీసుకుని 12 వార్డుల్లో ప్రతీ రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. మునిసిపాలిటీకి మూడు వాటర్‌ ట్యాంకులు ఉన్నాయి. భవిష్యత్తులో నీటి సమస్య ఉత్పన్నం అయితే మరిన్ని అద్దెబోర్లు తీసుకుని వార్డుల వారీగా రోజు తప్పి రోజు సరఫరా చేసే అవకాశం ఉంది.

అప్రమత్తంగానే ఉన్నాం

పట్టణంలో తాగునీటి ఎద్దడి నివారణకు మునిసిపల్‌ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నది. ఇప్పటివరకు పట్టణంలో తాగునీటి కష్టాలు లేవు. తాగునీటి సమస్య నివారణకు తగినన్ని నిధులు కేటాయించాం. ఈ మేరకు బోరు బావుల ఫ్లెషింగ్‌ తదితర పనులను చేపట్టాం. బస్తీల్లో తాగునీటి ఇబ్బందు లు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 9398915335కు ఫోన చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నాం.

- రామాంజూల్‌రెడ్డి, కమీషనర్‌, భువనగిరి మున్సిపాలిటీ

Updated Date - Apr 13 , 2024 | 12:11 AM