Share News

సాగర్‌లో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:13 AM

ఆంధ్రప్రదేశ - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్‌ పైలాన కాలనీ కొత్త వంతెన వద్ద పోలీసులు శుక్రవారం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఏర్పాటుచేశారు.

సాగర్‌లో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు
సాగర్‌లో అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్న సీఐ బీసన్న, ఎస్‌ఐ సంపత

నాగార్జునసాగర్‌, మార్చి 15: ఆంధ్రప్రదేశ - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్‌ పైలాన కాలనీ కొత్త వంతెన వద్ద పోలీసులు శుక్రవారం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఏర్పాటుచేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా సరిహద్దులో తనిఖీలు చేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు నాగార్జునసాగర్‌ సీఐ బీసన్న, ఎస్‌ఐ సంపత తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు చెక్‌పోస్టు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ వైపునకు వచ్చే వాహనాలతో పాటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ వైపునకు వెళ్లే వాహనాలను 24 గంటల పాటు సిబ్బందితో తనిఖీలు చేయించనున్నట్లు వారు పేర్కొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:13 AM