Share News

నాణ్యతా పరిశీలనకు హైదరాబాద్‌ ల్యాబ్‌కు విత్తనాలు

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:25 AM

విత్తనశుద్ధి కేంద్రంలోని విత్తనాలను పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రీతంకుమార్‌ తెలిపారు.

నాణ్యతా పరిశీలనకు హైదరాబాద్‌ ల్యాబ్‌కు విత్తనాలు
గడ్డిపల్లి విత్తనశుద్ధి కేంద్రంలో విత్తనాలను పరిశీలిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

గరిడేపల్లి, జూన 1: విత్తనశుద్ధి కేంద్రంలోని విత్తనాలను పరిశీలించేందుకు హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రీతంకుమార్‌ తెలిపారు. శనివారం మండలంలోని గడ్డిపల్లి గ్రామంలోని విత్తనశుద్ధి కేంద్రాలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వ్యవసాయ శాఖాధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. విత్తన నమూనాలను సేకరించి విత్తన క్వాలిటీ పరీక్ష కోసం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు పంపించినట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. విత్తనశుద్ధి కేంద్రాల్లో యూనివర్సిటీ అనుమతి పొందిన కంపెనీల నుంచే విత్తనాలు తీసుకువస్తున్నారా లేదా అనే విషయం విచారణ చేసి, వాస్తవంగా రైతుల పొలాల్లోనే విత్తనాలు పండిస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందం పాల్గొంది.

ఆత్మకూర్‌(ఎస్‌) : రైతులకు డీలర్లు కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సైదులు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయశాఖ ఆద్వర్యంలో నిర్వహించిన విత్తన దుకాణాల డీలర్ల అవగాహన సదుస్సులో ఆయన మాట్లాడారు. విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతీ రైతుకు వెంటనే రశీదు ఇవ్వాలని సూచించారు. కొనుగోలు వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రం ఏపూరులో విత్తనాల దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. వ్యవసాయాధికారి దివ్య, డీలర్లు దివ్య, సుధాకర్‌రెడ్డి, వినయ్‌, పూల్‌సింగ్‌, విష్ణువర్థనరెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:25 AM