Share News

ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్‌ పూర్తి

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:31 AM

భువనగిరి లోక్‌సభ పరిధిలో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే తెలిపారు.

ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్‌ పూర్తి

కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే

భువనగిరి అర్బన్‌, ఏప్రిల్‌ 21: భువనగిరి లోక్‌సభ పరిధిలో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో రాజకీ య పార్టీల ప్రతినిధులతో ఈవీఎం రెండో విడత ర్యాండమైజేషన్‌ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 25శాతం అదనంగా కలిపి మొత్తం 321 బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, 40శాతం అదనంగా కలిపి 359 వీవీప్యాట్లు కేటాయించనట్టు తెలిపారు. అదేవిధంగా ఆలేరుకు కలిపి 386బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, 432 వీవీప్యాట్లు కేటాయించినట్లు తెలిపారు. భువనగిరికి చెందిన యంత్రాలు జిల్లా కేంద్రంలోని ఆరోరా కళాశాల, ఆలేరుకు చెందినవి ఇండోర్‌ స్టేడియంలో భద్రపర్చినట్టు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి.బెన్‌షాలోమ్‌, కే.గంగాధర్‌, ఆర్డీవో పి.అమరేందర్‌, రాజకీ య పార్టీల ప్రతినిధులు బట్టు రామచంద్రయ్య, సోమ రవీందర్‌రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ ఎం.నాగేశ్వరచారి, తహసీల్దార్లు దేశ్యా, శ్రీనివా్‌సరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:31 AM