Share News

గుట్టలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:44 PM

యాదగిరికొండపైన అనుబంధ ఆల యం రామలింగేశ్వరుడి సన్నిధిలో శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం ఽధ్వజారోహణం సాయంత్రం భేరిపూ జ, దేవతాహ్వాన పర్వాలు శైవాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగా యి.

గుట్టలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

ఏకాదశి లక్షపుష్పార్చనలు

నిత్య ఆదాయం రూ.15.75లక్షలు

యాదగిరిగుట్ట, మార్చి 6: యాదగిరికొండపైన అనుబంధ ఆల యం రామలింగేశ్వరుడి సన్నిధిలో శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం ఽధ్వజారోహణం సాయంత్రం భేరిపూ జ, దేవతాహ్వాన పర్వాలు శైవాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగా యి. శివాలయంలోని మూలమూర్తులను ఆరాధించిన అర్చకులు శివరాత్రి మహోత్సవాల్లో వైశేషిక ఘట్టం ధ్వజారోహణ పర్వాలకు సంప్రదాయరీతిలో నిర్వహించారు. శ్వేత వస్త్రంపై పరమేశ్వరుడి ఇష్టవాహనమై న నందీశ్వరుడి చిత్రపటాన్ని చిత్రించిన పూజారులు ప్రత్యేక వేద మం త్ర పఠనాలతో అర్చించి ధ్వజస్తంభంపైకి ఆరోహణ గావించారు. ఉత్సవాలకు ముక్కోటి దేవతాగణాలను ఆహ్వానించే పర్వం భేరీపూజ, దేవతాహ్వాన పర్వాలు చేపట్టిన పూజారులు ఉత్సవాల్లో ఆయా దేవతలకు హవిస్సులను అందజేసేందుకు యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వేళ సోమకుంభార్చనలు, నమక, చమక, వేద మంత్ర పారాయణం జరిగింది. ఈ విశేష పర్వాలను దేవస్థాన ప్ర ధాన పురోహితుడు గౌరిభట్ల సతర్యనారాయణశర్మ, శివాలయ ప్రధానార్చకుడు గౌరిభట్ల నరసింహరామశర్మ, అర్చకబృందం నిర్వహించింది. ఆలయఅనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో కొ నసాగాయి. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో హోమం, ని త్య తిరుకల్యాణోత్సవం ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ యాదగిరీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పా ల్గొన్నారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.15,75,110ల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

కొండంతా కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు

రాచకొండ సీపీ డాక్టర్‌ తరుణ్‌జోషి

యాదగిరీశుడి సన్నిధిలో పూజలు

యాదగిరిగుట్ట, మార్చి6: యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కొండంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి అన్నారు. బుఽధవారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన ఆయనకు ఆర్చకులు ఆలయ మర్యాదల తో స్వాగతం పలికారు. ఆయన ప్రధానాలయంలోని స్వయంభువుల ను దర్శించుకుని ముఖమండపంలో ఉత్సవమూర్తుల వద్ద సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. ప్రాకార మండపంలో అర్చకులు ఆయనకు ఆశీర్వచనం నిర్వహించారు. దేవస్థాన అధికారులు ఆయనకు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కొండపైన ఆలయ పరిసర ప్రాంతాల్లో డీసీపీ రాజేశ్‌చంద్రతో కలిసి కలియదిరిగారు. ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు కొనసా గే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అధిక సం ఖ్యలో భక్తులు, పలువురు ప్రముఖులు విచ్చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. కొండపైన, కొండకింద ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో తనిఖీలు చేపట్టాలని, కొండంతా సీసీ కెమెరాల తో నిఘాను అప్రమత్తం చేయాలని, కొండపైన కమాండ్‌ కంటోల్ర్‌ రూమ్‌ ద్వారా నిఘా వ్యవస్థను మానిటరింగ్‌ చేయాలన్నారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు కొనసాగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ యనవెంట గుట్ట ఏసీపీ రమేశ్‌కుమార్‌, సిబ్బంది తదితరులున్నారు.

యాదగిరిగుట్ట రూరల్‌, ఆలేరు రూరల్‌: యాదగిరిగుట్ట రూరల్‌, ఆలేరుపోలీస్‌స్టేషన్లను తరుణ్‌ జోషి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలను సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట డీసీపీ రాజేష్‌ చంద్ర, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:44 PM