Share News

నేటినుంచి జిల్లాకేంద్రంలో సంబురాలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:41 AM

సంక్రాంతి పండుగ విశిష్టతను చాటే లా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మూడు రోజుల పాటు సంక్రాంతి సంబురాలు, జిల్లాస్థాయి గ్రామీ ణ క్రీడలు నేడు భువనగిరిలో ప్రారంభంకానున్నాయి.

నేటినుంచి జిల్లాకేంద్రంలో సంబురాలు

భువనగిరి టౌన, జనవరి 11: సంక్రాంతి పండుగ విశిష్టతను చాటే లా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మూడు రోజుల పాటు సంక్రాంతి సంబురాలు, జిల్లాస్థాయి గ్రామీ ణ క్రీడలు నేడు భువనగిరిలో ప్రారంభంకానున్నాయి. యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో జిట్ట రాధమ్మ ఫౌండేషన సహకారంతో 12, 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్న వేడుకలకు స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాట్లు పూర్తిచేశారు. కబడ్డీ వాలీబాల్‌, ఖోఖో, క్యారమ్స్‌తో పాటు తెలంగాణ సంప్రదాయ క్రీడలు గిల్లిదండా, తాడు బొంగరం, బెచ్చలాట, విద్యార్థులకు, ప్రతిభా పాఠవ పోటీలు మహిళలకు ముగ్గులు, లెమన స్పూన, స్కిప్పింగ్‌, మ్యూజికల్‌ చైర్‌, వామనగుండ్లు, తొక్కుడు బిల్ల తదితర తెలంగాణ సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుడు, సంబురాల నిర్వాహకుడు జిట్ట బాలకృష్ణారెడ్డి గురువారం ఏర్పాట్లను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో భువనగిరి నుంచే తెలంగాణ సంబురాలు ప్రారంభమయ్యాయని, తిరిగి అదే వేదికనుంచి ఉద్యమస్ఫూర్తిని చాటుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, గోమారి సుధాకర్‌రెడ్డి, దాసరి శ్రీనివాస్‌, అందె శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:41 AM