Share News

సాగర్‌ బౌద్ధ క్షేత్రం అద్భుతం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:26 AM

నాగార్జునసాగర్‌లో అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రం అద్భుతమని జమ్ముకశ్మీర్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ తాషీ రబ్‌స్థాన్‌ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాగర్‌ విజయవిహార్‌కు వచ్చిన ఆయన రాత్రి బస చేశారు. గురువారం ఉదయం పర్యాటక శాఖ లాంచీలో జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు చేరుకున్నారు.

సాగర్‌ బౌద్ధ క్షేత్రం అద్భుతం
బుద్ధవనంలో బుద్ధుడి పాద నమూనాల వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న తాషీ రబ్‌స్థాన్‌ దంపతులు

జమ్ముకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తి తాషీ రబ్‌స్థాన్‌

నాగార్జునసాగర్‌, జనవరి 11: నాగార్జునసాగర్‌లో అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రం అద్భుతమని జమ్ముకశ్మీర్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ తాషీ రబ్‌స్థాన్‌ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాగర్‌ విజయవిహార్‌కు వచ్చిన ఆయన రాత్రి బస చేశారు. గురువారం ఉదయం పర్యాటక శాఖ లాంచీలో జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు చేరుకున్నారు. అక్కడి మ్యూజీయాన్ని తిలకించి, హిల్‌కాలనీలో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనానికి చేరుకున్నారు. బుద్ధుడి పాదాలకు సతీసమేతంగా పుష్పాంజలి ఘటించారు. ధ్యాన మందిరంలో కాసేపు ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్ములోని లడఖ్‌ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో బౌద్ధులు సాగర్‌కు వస్తుంటారన్నారు. తాను కూడా బౌద్ధ ఆరాధకుడినేనని తెలిపారు. ఇక్కడి బుద్ధవనం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. బుద్ధుడి బోధనలు ప్రశాంత జీవన విధానానికి దోహదపడతాయన్నారు. వారికి సాగర్‌ విశేషాలను పర్యాటకశాఖ గైడ్‌ సత్యనారాయణ వివరించారు. ఆయన వెంట డీటీ శరత్‌చంద్ర, ఆర్‌ఐ దండా శ్రీనివా్‌సరెడ్డి, బుద్ధవనం సూర్‌వైజర్‌ విష్ణు, నిడమనూరు కోర్టు సిబ్బంది కాలిక్‌ ఉన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:26 AM