Share News

శబరిగిరీశా అయ్యప్ప..శరణం శరణం అయ్యప్ప

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:09 AM

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి స్వామి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అయ్యప్ప మహాపడి పూజ కనివిని ఎరుగని రీతిలో, భారీ సెట్టింగ్‌ మంటపాల మధ్య శోభాయమానంగా నిర్వహించారు.

శబరిగిరీశా అయ్యప్ప..శరణం శరణం అయ్యప్ప
హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మహాపడి పూజలో పాల్గొన్న సీఎల్‌పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, సుమతి దంపతులు , ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి

హాలియాలో మహాపడిపూజ

శోభాయమానంగా మంటప అలంకరణ

భారీగా తరలివచ్చిన భక్తులు

హాలియా, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి స్వామి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అయ్యప్ప మహాపడి పూజ కనివిని ఎరుగని రీతిలో, భారీ సెట్టింగ్‌ మంటపాల మధ్య శోభాయమానంగా నిర్వహించారు. తాంత్రిక స్వామి సత్యనారాయణ గురుస్వామి పడిపూజను చేపట్టారు. కొనసీమకు చెందిన రాజేష్‌ కళాబృందం ఆలపించిన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శివుని అవతారంలో ఓ భక్తుడు ఉత్సాహాపరిచారు. సీఎల్‌పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, సుమతి దంపతులు వేడుకల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే జైవీర్‌ కుమారుడు శివారెడ్డి కూడా మాలవేసుకొని తండ్రితో పాటు పూజ నిర్వహించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పడిపూజకు పాల్గొన్నారు. స్వాము లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గురుస్వాములు మేడేపల్లి మోహనరావు, గౌని రాజారమే్‌షయాదవ్‌, ఉపేందర్‌రెడ్డి ఏర్పాట్లు సమీక్షించారు.

మూడు వేల మంది స్వాములకు అల్పహారం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో నల్లగొండ డీసీసీ అధ్య క్షుడు కేతావత శంకర్‌నాయక్‌, యడవెల్లి నరేందర్‌ రెడ్డి, నాయకులు కర్నాటి లింగారెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, కాకునూరి నారాయణగౌడ్‌, తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, రాజాప్రసాద్‌, చిట్టిపోలు యాదగిరి, చింతల చంద్రారెడ్డి, అంకతి సత్యం, ఆంజనేయులు, రామేశ్వరీ, ప్రవీణ్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, పబ్బు యాదగిరి, భాస్కర్‌నాయక్‌, కృష్ణనాయక్‌, పొదిల కృష్ణ, వెంపటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:10 AM