Share News

ఎస్‌.. నేనే బాస్‌!

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:50 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో చిరుద్యోగులు అభద్రతతో వణికిపోతున్నారు. ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుందన్న ఆశతో ఉన్న వారిని ఉన్న ఉద్యోగం ఊడిపోతుందన్న భయం వెంటాడుతోంది.

ఎస్‌.. నేనే బాస్‌!

తల్చుకున్నానంటే 120మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అవుట్‌

రెండు నెలల్లో ఇంటిబాట పట్టిస్తానంటూ డీసీసీబీలో ఓ అధకారి అల్టిమేటం

వణికిపోతున్న చిరుద్యోగులు

నల్లగొండ, ఏప్రిల్‌ 17 : జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో చిరుద్యోగులు అభద్రతతో వణికిపోతున్నారు. ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుందన్న ఆశతో ఉన్న వారిని ఉన్న ఉద్యోగం ఊడిపోతుందన్న భయం వెంటాడుతోంది. డీసీసీబీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆయా బ్రాంచ్‌లు, పీఏసీఎ్‌సలు, జిల్లా కార్యాలయంలో 120మంది వరకు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్నారు. కొందరు 20 నుంచి 25 ఏళ్లుగా, మరికొందరు 10 నుంచి 12 ఏళ్లుగా, ఇంకొందరు 5 నుంచి 7 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా వారికి ఉద్యోగ భద్రతపై నమ్మకం పోతోంది. పర్మినెంట్‌ కోసం గతంలో కొందరు కోర్టును ఆశ్రయించగా, మరికొందరు పాలకవర్గాలపై నమ్మకం పెట్టుకుని పనిచేసుకుంటూపోతున్నారు. అయితే పర్మినెంట్‌ ఏమోకాని ఉన్న ఉద్యోగం కూడా పోతుందన్న భయం వారిని నీడలా వెంటాడుతోంది.

రెండు నెలల్లో ఇంటికి వెళ్లిపోతారు

డీసీసీబీలోని ఓ ఉన్నతాధికారి తీసుకుంటున్న నిర్ణయాలు చిరుద్యోగులను హడలెత్తిస్తున్నాయి. రెండునెలల్లో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని ఇంటిబాట పట్టిస్తానని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డితో పాటు పాలకవర్గం అంతా అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి మద్దతు ఉండగా సదరు అధికారి మాత్రం ఆ సిబ్బందిని తొలగించి తీరుతానని బీష్మించినట్లు చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన ఎంసీ మీటింగ్‌లో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించకూడదని పాలకవర్గం నిర్ణయించినట్లు సమాచారం. అయితే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వల్ల ఖజానాకు నష్టం వాటిల్లుతోందని వారితో ఉపయోగం లేదన్న విధంగా ఆఅధికారి వితండవాదన చేయడం పాలకవర్గాన్ని సైతం ఆశ్చర్యాన్ని కలిగించినట్లు తెలిసింది. 107 ఏళ్ల బ్యాంకు చరిత్రలో రూ.2300కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. దీంతోపాటు బ్యాంకు లాభాల బాటలో పయనిస్తున్న సమయంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తుతోంది.

పీఏ ద్వారా వెళ్లాల్సిందే

గతంలో లేని కొత్తవిధానం డీసీసీబీలో నడుస్తోందని వాపోతున్నారు. డీసీసీబీ, జిల్లా కార్యాలయంతోపాటు పీఏసీఎస్‌ సీఈవోలు, బ్రాంచీల మేనేజర్లు, ఉన్నతాధికారులు సైతం ఆసార్‌ను కలవాలన్నా, ఫైళ్ల పరిశీలన జరగాలన్నా పీఏ ద్వారానే అన్న పరిస్థితి ఏర్పడింది. డీసీసీబీలో గతంలో పనిచేసిన ఏ ఉన్నతాఽ దికారి వారి ఛాంబర్ల వద్ద అటెండర్‌కు మించి ఉద్యోగి ఉండరు. ఈయనమాత్రం ప్రత్యేకంగా ఓ పీఏనే నియమించుకున్నారు.

సిబ్బంది తొలగింపుపై నిర్ణయం జరగలేదు : శంకర్‌రావు, సీఈవో, డీసీసీబీ, నల్లగొండ

అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది తొలగింపు విషయం కొన్ని రోజుల క్రితం పాలకవర్గ మీ టింగ్‌లో చర్చించిన విషయం వాస్తవమే. అయితే వారిని తొలగించ కూడదని, ప్రస్తుతానికి నిర్ణయించాం.

Updated Date - Apr 18 , 2024 | 12:50 AM