రోడ్డు భద్రత అందరి బాధ్యత: ఎస్పీ
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:03 AM
రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు.
మునగాల రూరల్, ఫిబ్రవరి 5 : రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సోమవారం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(65)పై మునగాల పోలీ్‌సస్టేషన పరిధిలోని బ్లాక్‌స్పాట్స్‌ను పరిశీలించారు. జాతీయ రహదారిపై మునగాల కేంద్రంతో పాటు మాధవరం, మొద్దులచెర్వు, కలకోవ, ముకుందాపుం, ఆకుపాముల బస్‌స్టా్‌పల వద్ద రోడ్డు పరిస్థితులను ఆయన పరిశీలించారు. తరుచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను,ఎనహెచఏఐ, జీఎంఆర్ అధికారులను ఆదేశించారు. జంక్షన్ల వద్ద ఇంజనీరింగ్ లోపాలు గుర్తించి, సవరించాలన్నారు. మునగాల మండల కేంద్రంలో స్థానికులతో మాట్లాడుతూ జాగ్రత్తలు పాటించాలని, రాంగ్ రూట్‌లో వాహనాలు నడపవద్దని, రైతులు అప్రమత్తం గా ఉండాలన్నారు. గ్రామసభలు నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలను వివరించాలన్నారు. ప్రమాదాల నివారణకు కృషి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దా లని కోరారు. కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ ప్రకాష్, మునగాల సీఐ వీరరాఘవులు, ఎస్‌ఐ లోకేష్, జీఎంఆర్ అధికారులు రాజేంద్రకుమార్,నాగకృష్ణ పాల్గొన్నారు.