Share News

కేసీఆర్‌ ఇచ్చిన హామీలే రేవంత్‌రెడ్డి ఇచ్చారు

ABN , Publish Date - May 20 , 2024 | 12:24 AM

మాజీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మో సపూరిత హామీలనే రేవంత్‌రెడ్డి ఇచ్చార ని, అతి తక్కువ కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలతో ఛీ కొట్టించుకుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం, మిర్యాలగూడలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్‌ ఇచ్చిన హామీలే రేవంత్‌రెడ్డి ఇచ్చారు

ఉప ఎన్నికలో మేధావులు ఆలోచించి ఓటు వేయాలి

మాజీ మంత్రి ఈటల

నల్లగొండటౌన్‌, మిర్యాలగూడ, మే 19: మాజీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మో సపూరిత హామీలనే రేవంత్‌రెడ్డి ఇచ్చార ని, అతి తక్కువ కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలతో ఛీ కొట్టించుకుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం, మిర్యాలగూడలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ ఊహించని విధంగా సర్వేలకు కూడా అర్థం కాని ఫలితాలు రానున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా దేశ పురోగమనం, దేశ ఔన్నత్యం కోసం మోదీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీలే నేడు రేవంత్‌రెడ్డి ఇచ్చాడని, వాటి అమలు బీఆర్‌ఎ్‌సకు సాధ్యం కాలేదని, రెండు లక్షల రుణమాఫీ ఎలా జరుగుతుందని సందేహం వ్యక్తం చేశారు. శాసనమండలి ఉప ఎన్నికలో ప్రజలంతా ఆలోచించి బీజేపీ అభ్యర్థి ప్రేమందర్‌రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్‌, నాయకులు శానంపూడి సైదిరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్లు, గోలి మధుసూధన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్‌, సుభాష్‌చందర్‌, మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌, సాధినేని శ్రీనివాస్‌, లాలునాయక్‌, కంకణాల నివేదిత, బొబ్బ భాగ్యరెడ్డి, సుభాష్‌రెడ్డి, కన్మంత శ్రీదేవిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నారపరాజు రాంచందర్‌రావు, కాటేపల్లి జనార్ధన్‌, గార్లపాటి వెంకటయ్య, సాధినేని శ్రీనివాసరావు, సుభా్‌షచందర్‌జీ, గూడూరు శ్రీనివాసరావు, చెరుపల్లి కరుణాకర్‌, సుధాకర్‌, సత్యప్రసాద్‌, పురుషోత్తంరెడ్డి, సైదులు, సరిత, పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 12:24 AM