Share News

బస్‌ డిపో కోసం అవిశ్రాంత పోరాటం

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:14 AM

తిరుమలగిరిలో బస్‌డి పో సాధించే వరకూ అవిశ్రాంత పోరాటం చేస్తామని డిపో సాధన సమితి నాయకులు కందుకూరి ప్రవీణ్‌ అన్నారు.

బస్‌ డిపో కోసం అవిశ్రాంత పోరాటం
తిరుమలగిరిలో సంకల్ప దీక్షలో కూర్చున్న నాయకులు

తిరుమలగిరి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : తిరుమలగిరిలో బస్‌డి పో సాధించే వరకూ అవిశ్రాంత పోరాటం చేస్తామని డిపో సాధన సమితి నాయకులు కందుకూరి ప్రవీణ్‌ అన్నారు. డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో మునిసిపల్‌ కేంద్రంలో బుధవారం సంకల్పదీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అ ధికారులు డిపో కోసం చొరవ చూపాలన్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో కవి, గాయకుడు ఏపూరి సోమన్న, కడెం లింగయ్య, కందుకూరి సోమయ్య, కొత్తగట్టు మల్లయ్య, పాష, కొండసోమయ్య,కందుకూరి రమేష్‌,ఉదయ్‌, ప్రశాంత పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:14 AM