మార్కెట్ ఫీజు రూ.27కోట్లు విడుదల
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:23 AM
జిల్లాలో 2020- 21,2021-22 రెండు సీజన్లలో జిల్లావ్యాప్తంగా ప్రభు త్వం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగో లు కేంద్రాలను ప్రారంభించి, రైతులనుంచి ధాన్యం కొనుగోలుచేశారు.

ఐకేపీ, పీఏసీస్ కేంద్రాలను నుంచి ఒక్కశాతం పన్ను రూపంలో
సివిల్ సప్లయ్ నుంచి మార్కెటింగ్ శాఖకు నిధులు విడుదల
రెండేళ్ల మార్కెట్ ఫీజు బకాయిలు విడుదల
అత్యధికంగా పేటమార్కెట్‌కు రూ.11కోట్లు
సూర్యాపేట సిటీ, మార్చి 5: జిల్లాలో 2020- 21,2021-22 రెండు సీజన్లలో జిల్లావ్యాప్తంగా ప్రభు త్వం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగో లు కేంద్రాలను ప్రారంభించి, రైతులనుంచి ధాన్యం కొనుగోలుచేశారు. తాజాగా ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రా ల నుంచి ఆయా వ్యవసాయ మార్కెట్లకు రావాల్సిన ఒక్కశాతం పన్ను(సె్‌స)ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సివిల్ సప్లయి శాఖనుంచి మార్కెటింగ్ శాఖకు వి డుదల చేసిందని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కేఎన్‌శర్మ తెలిపారు. జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్లకు కలిపి ఒక్కశాతం పన్ను రూపంలో రూ.27,92,80,222 విడుదల చేసిందని తెలిపారు. మార్కెట్లకు సెస్ రూపంలో వచ్చిన నిధులను ఆయా వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
మార్కెట్లకు మహర్దశ
ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలనుం చి మార్కెట్లకు వచ్చిన ఒక్కశాతం పన్నుతో జిల్లాలో ఉన్న ఆరు వ్యవసాయ మార్కెట్లలో నిధులు లేక నిలిచిన పనులకు మహర్దశ పట్టనుంది. వ్యవసాయ మార్కెట్ల ఆధునికీకరణ, నూతన భవనాల నిర్మా ణం, మార్కెట్లలో అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాట్లు, సంతలో మౌలిక వసతుల కల్పన, తదితర పనులకు ఈ నిధులను ఉపయోగించనున్నారు.
మార్కెట్ ఫీజు రూ.27కోట్లు విడుదల
ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా ఆయా పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ఆదాయంలో ఆయా వ్యవసాయ మార్కెట్ల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులు వ్యవసాయ మా ర్కెట్లకు ఒక్కశాతం పన్ను (సెస్) చెల్లించాల్సి ఉం టుంది. ఆ విధంగా ఒక్కశాతం పన్ను చెల్లింపు లు చేస్తే, వ్యవసాయ మార్కెట్ల అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన టార్పాలిన్లు, ధా న్య ం జల్లడపట్టే యంత్రాలను సరఫరా చేస్తుంది. కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాత మళ్లీ వాటిని వ్యవసాయ మార్కెట్లకు అందజేస్తారు. వీటితోపాటు ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మార్కెట్లనుంచి మార్కెట్ రశీదులను తీసుకెళ్తుంటారు. ఆ విధంగా సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్లకు ప్రభుత్వం పన్ను బకాయి రూ.27,92,80,222 విడుదల చేసింది. అత్యధికంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు రూ. 11 కోట్లు రాగా, అత్యుల్పంగా నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్‌కు రూ.42 లక్షలు పన్నుల రూపంలో ఆదాయం వచ్చింది.
పెండింగ్‌లో రూ.10కోట్లు
2023 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ఇంకా రూ. 10కోట్లపైగా మార్కెట్ ఫీజు రావాల్సి ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. 2020 నుంచి 2022 వరకు పెండింగ్‌లో ఉన్న మార్కెట్ ఫీజు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని, 2023 ఖరీఫ్, రబీ సీజన్లకు చెందిన మార్కెట్ ఫీజు బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మార్కెట్ల అభివృద్ధికి నిధులను ఖర్చు చేయాలి : కేఎన్.శర్మ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి.
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు సెస్ రూపంలో వచ్చిన నిధులను ఆయా వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి ఖర్చు చేయాలి. నిధులు లేక పెండింగ్‌లో మిగిలిన అభివృద్ధి పనులకు ఆ నిధులను ఖర్చు చేయాలి. పన్నుల రూపంలో వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకొని మార్కెట్ల అభివృద్ధికి ఆయా మార్కెట్ల కార్యదర్శులు కృషి చేయాలి.
వ్యవసాయ మార్కెట్ విడుదలై పన్ను
సూర్యాపేట రూ.11,20,96,624
హుజుర్‌నగర్ రూ.3,08,47,022
కోదాడ రూ.4,66,00,716
తుంగతుర్తి రూ.3,86,11,805
తిరుమలగిరి రూ.4,68,98,636
నేరుడుచర్ల రూ.42,25,149